Padi Kaushik Reddy: ఎంత పనైంది.. నోటీసులు జారీ చేసిన ఈసీ!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది.
పోలింగ్‌ను సజావుగా కొనసాగించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఓటర్లు అధికారాన్ని ఎవరికి కట్టబెట్టారనేది తేలిది అప్పుడే.

ఈ పరిస్థితుల్లో అధికార భారత్ రాష్ట్ర సమితికి చెందిన హుజూరాబాద్ (Huzurabad) అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ఇబ్బందుల్లో పడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఆయనపై కన్నెర్ర చేశారు. నోటీసులను పంపించారు. సంతృప్తికరమై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
దీనికి కారణాలు లేకపోలేదు. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారం చివరిరోజున పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ఈ ఎన్నికల్లోతనను గెలిపించకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని, విజయయాత్రకు బదులుగా తన శవయాత్ర జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు.
దీన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ వ్యాఖ్యలు ఓటర్లను బెదిరించినట్లుగా, బ్లాక్ మెయిల్ చేసినట్లుగా ఉన్నాయని భావించింది ఈసీ. దీనిపై విచారణకు ఆదేశించింది. సమగ్ర నివేదికను అందజేయాలనీ స్థానిక ఎన్నికల కమిషన్ సిబ్బందిని ఆదేశించింది. పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది.












Click it and Unblock the Notifications