కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెద్దపల్లిలో పెద్దపులి: స్థానికుల బెంబేలు, అడుగులు చూసి గుర్తింపు..?

|
Google Oneindia TeluguNews

అడవుల నరికివేత, మహా వృక్షాలు నెలకొరగడంతో మూగజీవాలు రోడ్లపైకి వస్తున్నాయి. కోతులు, ఎలుగుబంట్లు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. అయితే చిరుతపులి, పెద్దపులి మాట వింటేనే జనం భయపడిపోతుంటారు. ఆవులు, దూడలనే కాదు ప్రజలపై దాడి చేస్తుంటాయి. అయితే పెద్దపల్లి జిల్లాలో పెద్దపులి అడుగులు కనిపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

tiger roam in peddapalli forest..

Recommended Video

Producer SKN Exclusive Interview Part 2 | OTT Platforms Not Affect Theatres

ముత్తారం మండలంలోని దర్యాపూర్‌ గ్రామ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారించినట్టు తెలుస్తోంది. పెద్దపులి అడుగులను గ్రామస్తులు గుర్తించారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అడుగులను పరిశీలించారు. వాటిని చూసి పెద్దపులి అడుగులుగా నిర్ధారించారు. బగుల గుట్ట అడవులకు వచ్చి.. దర్యాపూర్‌లో తిరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా భయటకు వెళ్లొద్దని స్పష్టంచేశారు.

English summary
tiger roam in peddapalli forest. locals are feared the tiger roam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X