కన్నులపండుగగా రాములోరి కల్యాణం.. ఈసారి భక్తులకు అవకాశం
భద్రాచల సీతారాముల కల్యాణం ఈ సారి వైభవంగా జరగనుంది. ప్రతీ సారి రాములోరి కల్యాణం బ్రహ్మండంగానే సాగుతుంది. కానీ కరోనా వైరస్ వల్ల గత రెండేళ్ల నుంచి ఏకాంతంగా సాగుతుంది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఈ సారి రాములోరి కల్యాణాన్ని భక్తుల మధ్యే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భద్రాచలం ఈవో అధికారికంగా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏప్రిల్ 2 నుంచి 16వ తేదీ వరకు శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. 10వ తేదీన సీతారాముల కల్యాణ మహోత్సవం, 11న మహా పట్టాభిషేకం చేసి రథోత్సవం నిర్వహిస్తారు. రాములోరి కల్యాణోత్సవానికి సంబంధించి టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని భద్రాచలం ఈవో ప్రకటించారు.

శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో.. అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు. అతని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గల భద్రాచలం సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవంగా జరుపుతారు.
తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి, లేదా వసంతోత్సవంతో తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. కరోనా కేసులు తగ్గడంతో.. ఈ సారి జనాలను కూడా అనుమతిస్తున్నారు. రెండేళ్ల తర్వాత ఆ ఆది దంపతుల కల్యాణ ఘట్టం కనులారా తిలకించబోతున్నారు.












Click it and Unblock the Notifications