ఖమ్మంలో కారు దిగిన కీలక నేత.. నామా సక్సెసా? తుమ్మలకు భారీ ఎఫెక్టా?

కారు జోరుకు బ్రేకులు పడుతున్నాయా? గులాబీవనానికి కంచె లేకుండా పోయిందా? ఇలాంటి ప్రశ్నలకు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న తీరే సమాధానంగా కనిపిస్తోంది. ఒకనాడు ఆపరేషన్ ఆకర్ష్ తో ఇతర పార్టీల నేతల్ని గులాబీ గూటికి లాగిన స్ట్రాటజీ ఏమైపోతోందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజాగా కారును వీడి చేయందుకున్న నేతలకు తోడు మరికొందరికి కాంగ్రెస్ తీర్థం పోస్తామనే ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు నిజమవుతున్నట్లు కనిపిస్తోంది. అదలావుంటే కామ్రెడ్ల కంచుకోట ఖమ్మంలో ఇప్పుడిప్పుడే పాగా వేస్తున్న టీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఎదురైంది. ఖమ్మం కారుకు అన్నీ తానై వ్యవహరిస్తున్న కీలకనేత పార్టీకి గుడ్ బై చెప్పడం చర్చానీయాంశంగా మారింది.

షేక్ బుడాన్ బేగ్.. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. ఖమ్మం నియోజకవర్గంతో పాటు పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో మంచి పట్టున్న లీడర్. ఇలాంటి కీలకమైన నేత టీఆర్ఎస్ పార్టీని వీడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

టీఆర్ఎస్ లో కీలకం.. టీడీపీ ఆకర్ష్ మంత్రం

టీఆర్ఎస్ లో కీలకం.. టీడీపీ ఆకర్ష్ మంత్రం

వైరాకు చెందిన బుడాన్ బేగ్ ఇంజనీరింగ్ పట్టభద్రులు. టీఆర్ఎస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. కామ్రేడ్ల కంచుకోటకు మారుపేరైన ఖమ్మంలో గులాబీ జెండా రెపరెపలాడించారు. సభ్యత్వాలు పెంచడంతో పాటు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు జిల్లాలో అండగా నిలిచారనే పేరుంది. అయితే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన బుడాన్ బేగ్ కు ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని చాలామంది భావించారు. పార్టీ అధిష్టానం మాత్రం టికెటివ్వలేదు. దీంతో పార్టీలో తనకు సముచిత ప్రాధాన్యం దక్కలేదని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు కొన్ని విషయాల్లో పార్టీ అధిష్టానం విధానాలు ఆయనకు నచ్చడం లేదట. అందుకే కారు దిగి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు.

తుమ్మల వర్సెస్ నామా..! బుడాన్ బేగ్ రాజీనామా

తుమ్మల వర్సెస్ నామా..! బుడాన్ బేగ్ రాజీనామా

తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు మధ్య విభేదాలు కూడా బుడాన్ బేగ్ టీడీపీ ఎంట్రీకి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఆ ఇద్దరు కూడా టీడీపీ నేతలే. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక "తుమ్మల" గులాబీ తీర్థం పుచ్చుకుని మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. అటు "నామా" టీడీపీ లోనే కొనసాగుతున్నారు. జిల్లాలో ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నువ్వా నేనా అనే రీతిలో రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది.

అయితే ఈ ఎన్నికల్లో ఖమ్మం నుంచి మహాకూటమిగా అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ ను గెలిపించేందుకు తుమ్మల విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నామా కూడా దేనిలో తగ్గడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మంచిపట్టున్న టీఆర్ఎస్ నేత బుడాన్ బేగ్ ను తమ వైపు లాగితే విజయం ఖాయమని భావించి నామా చక్రం తిప్పినట్లు వినికిడి.

ఈనెల 28న ముహుర్తం.. బాబు సమక్షంలో టీడీపీ తీర్థం

ఈనెల 28న ముహుర్తం.. బాబు సమక్షంలో టీడీపీ తీర్థం

మహాకూటమి వర్సెస్ టీఆర్ఎస్ గా సాగుతున్న ఈ ఎన్నికల పర్వం ఆపరేషన్ ఆకర్ష్ కు దారి తీసింది. టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు కీలక నేతలకు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పోశారు ఆ పార్టీ పెద్దలు. తాజాగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు పార్టీకి గుడ్ బై చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లాలో మంచి పట్టున్న బుడాన్ బేగ్ అనూహ్యంగా టీడీపీ పార్టీకి దగ్గరయ్యారు. దీంతో జిల్లాలో టీఆర్ఎస్ కు గట్టిదెబ్బ తగులుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈనెల 28న ఖమ్మంలో జరిగే మహాకూటమి బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో బుడాన్ బేగ్ తెలుగుదేశం కండువా కప్పుకుంటారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+