ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె... ఖమ్మంలో ఉద్రిక్తత... ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్‌పై దాడి...!

|
Google Oneindia TeluguNews

ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస రెడ్డి ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆందోళనలో పాల్గోన్న మరో ఉద్యోగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అయితే అక్కడే ఉన్న తోటి ఉద్యోగులు ఆయన నీళ్లు పోసి ప్రాణాలను కాపాడారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది.

శనివారం మధ్యాహ్నం ఖమ్మం ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలోనే ఆయన్ను హూటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే శ్రీనివాస రెడ్డికి అధిక గాయాలు కావడంతో ఆరోగ్య పరిస్థితి విషయంగా మారింది. దీంతో విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన కార్మికులు ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు.

Tension at Khammam district

తాత్కాలిక డ్రైవర్‌పై దాడికి యత్నించారు. దీంతో బస్సు వదిలి డ్రైవర్‌ పరారైయిన పరిస్థితి నెలకొంది.. ఆందోళనల మధ్య కలెక్టర్‌ ఎదుట ఆర్టీసీ కార్మికులు బైఠాయించారు. భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నాయి.

మరోవైపు ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులకు మద్దతుగా స్థానికంగా ఉన్న సీపిఐ, సీపీఎం, న్యూడెమోక్రసిల పార్టీల నేతలు కార్మికులు చేస్తున్న మద్దతు పలుకుతూ ఆందోళనల్లో పాల్గోన్నారు. ఇప్పటికైన కేసీఆర్ తీరులో మార్పు రావాలని పలువురు నేతలు కోరారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా ఈనెల 19న సమ్మెలో బాగంగా బంద్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే..

English summary
Tensions have been continuing in Khammam district, after the suicide attempt of RTC driver Srinivasa Reddy in evening today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X