ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం: పార్టీ మారతారా, కాంగ్రెస్, బీజేపీతో టచ్..?

|
Google Oneindia TeluguNews

తుమ్మల నాగేశ్వరరావు.. మాజీ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్యనేత.. కానీ ఆ పార్టీతో అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారతారా అనే సందేహాలు తలెత్తాయి. దానికి తగ్గట్టు గురువారం అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీంతో తుమ్మల పార్టీ మార్పు తథ్యమేనా అనే ప్రశ్నలకు బలం చేకూరింది. తుమ్మలతో.. కాంగ్రెస్, బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. మరీ ఆయన ఏ పార్టీలోకి వెళతారనే అంశం మాత్రం క్లారిటీ లేదు.

ఆత్మీయ సమ్మేళనం

ఆత్మీయ సమ్మేళనం


ములుగు జిల్లా వాజేడులో అభిమానులతో తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేశారు. గురువారం ఉదయం భద్రాద్రి రామయ్య ఆలయంలో ప్రత్యేక​ పూజలు నిర్వహించారు. తర్వాత 350 కార్లతో ర్యాలీగా వాజేడుకు బయలుదేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా తుమ్మల అనుచరులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. తుమ్మల పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటు తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనంపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిఘా పెట్టినట్టు సమాచారం.

 దూరం.. దూరంగానే

దూరం.. దూరంగానే


గతకొంత కాలం నుంచి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేరు. ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొంత కాలంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాలకు తుమ్మల నాగేశ్వరరావు దూరంగా ఉంటున్నారు. దీంతో అనుమానాలు సాధారణంగానే వస్తుంటాయి. ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌, బీజేపీ కీలక నేతలతో టచ్‌లో ఉన్నారనే వార్తలు వినిపించాయి. వీటిని తుమ్మల కొట్టిపారేశారు. కానీ తుమ్మల ఆత్మీయ సమ్మేళనంతో మరోసారి చర్చకు వచ్చింది.

నామాతో విభేదాలు.. కంటిన్యూ

నామాతో విభేదాలు.. కంటిన్యూ


తుమ్మల నాగేశ్వరరావు అంతకుముందు టీడీపీలో ఉన్నారు. అక్కడ కూడా కీలక నేతగా వ్యవహరించారు. తుమ్మల నాగేశ్వరరావుకు నామా నాగేశ్వరరావుకు మధ్య అంతగా పొసగదు. వీరిద్దరూ టీడీపీలో కలిసి ఉన్న విభేదాలు మాత్రం అలానే ఉండేవి. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి కూడా ఇద్దరు వచ్చేశారు. తుమ్మల మంత్రిగా పనిచేయగా.. ఇప్పుడు నామా ఎంపీగా ఉన్నారు. అయినప్పటికీ వీరి మధ్య విభేదాలు తగ్గలేదు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు తుమ్మల ప్రయత్నించారని నామా నాగేశ్వరరావు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే తుమ్మల పార్టీ మారుతున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. దీని గురించి తుమ్మల కానీ.. టీఆర్ఎస్ పార్టీ కానీ స్పందించలేదు.

English summary
ex minister tummala nageshwar rao may change political party. he will be join congress or bjp in soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X