కిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం: రోగులు, సిబ్బంది బయటికి పరుగులు
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలోని కిమ్స్ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని సిటీ స్కాన్ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు దట్టంగా అలుముకున్నాయి. రోగులు, వారి సహాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో భయాందోళనలకు గురైన రోగులు, సహాయకులు ఆస్పత్రి బయటకు పరుగులు పెట్టారు.
వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది ఐసీయూ, ఇతర విభాగాల్లో చికిత్స తీసుకుంటున్న రోగులను సమీపంలోని ఇతర ఆస్పత్రులకు తరలించారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఆస్పత్రి వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసింది.

ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు ఊపరి పీల్చుకున్నారు. షాట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగివుండవచ్చని భావిస్తున్నారు.
కిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం: రోగులు, సిబ్బంది బయటికి పరుగులు#bhadrachalam, #bhadradrikothagudem, #FireAccident pic.twitter.com/joG3u50fnr
— oneindiatelugu (@oneindiatelugu) October 3, 2022












Click it and Unblock the Notifications