భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం, 53 అడుగులకు చేరిన నీటిమట్టం, 3వ ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 53 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి భీకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మధ్య రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు వద్ద 22 గేట్లు ఎత్తారు. 52 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు, మహారాష్ట్రలో మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో గోదావరి నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో పలు ఆలయాలు నీటమునిగాయి.
ఆదివారం రాత్రి భద్రాచలం వద్ద గోదారమ్మ 43 అడుగులకు చేరుకుంది. దీంతో భద్రాచలం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. నిన్న30 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నదీ.. ఇవాళ అదీ 53 అడుగులకు చేరింది. గోదావరి ప్రవాహం పెరుగుతుంటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ ఇప్పటికే హెచ్చరించారు. ఇటు ఎస్ఆర్ఎస్పీకి కూడా భారీగా వరదనీరు పోటెత్తింది. ఇటు సింగూరు ప్రాజెక్టులోకి కూడా గరిష్టంగా వరదనీరు వచ్చింది.