రూ.లక్ష పెడితే రూ.3 లక్షలిచ్చిన స్టాక్.. ఏడాదిలో హైరిటర్న్స్
స్టాక్ మార్కెట్లు ఎప్పుడూ ఒడిదొడుకులకు లోనవుతూనే ఉంటాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకునే పరిణామాలతోపాటు దేశవ్యాప్తంగా కంపెనీల పనితీరుతోపాటు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు మార్కెట్ పై ప్రభావం చూపిస్తుంటాయి. ఇటీవల కాలం నుంచి భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకువెళుతున్నాయి. సెన్సెక్స్ అయితే ఏకంగా 63వేల మార్క్ దాటింది.
ఈ పరిణామాలను పరిశీలించిన పెట్టుబడిదారులు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఈక్విటీ అనేది ఎంతో రిస్క్ తో కూడుకున్న విషయమనేది గమనించాలి. అంత సులువుగా లాభాలు అందుకోలేరు. కొన్ని స్టాక్స్ మాత్రం పెట్టుబడిదారులకు లాభాలనిస్తూనే ఉంటాయి. తక్కువ సమయంలోనే వారిని లాక్షాధికారులను చేస్తాయి. అయితే అందుకు ఓర్పు ఉండాలి. ఓపికతో ఎదురు చూడాలి. అప్పుడే విజయవంతమవుతారు.

కేపీ ఎనర్జీ లిమిటెడ్ (KP Energy Limited) కంపెనీ స్టాక్ సంవత్సరం వ్యవధిలో పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. 2022 జూన్ 8న ఈ కంపెనీ షేరు ధర రూ.82 గా ఉంది. 2023 జూన్ 8 నాటికి రూ.234.25కు చేరింది. అంటే సంవత్సర కాలంలో 186 శాతం పెరిగింది. ఈ లెక్కన చూసుకుంటే ఏడాది క్రితం ఈ కంపెనీ షేర్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే వాటి విలువ తాజాగా రూ.2.86 లక్షలు అవుతుంది.
కంపెనీ నెట్ ప్రాఫిట్ 190.71 శాతం పెరిగి రూ.15.77 కోట్లుగా నాలుగో త్రైమాసికంలో నమోదు చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ.25.65 కోట్లుగా, నెట్ సేల్స్ 38 శాతం పెరిగి రూ.148.55 కోట్లుగా ఉంది. తాజాగా కంపెనీ పీఈ విలువ 12.2 వద్ద, ఇండస్ట్రీ పీఈ విలువ 34.5 వద్ద కొసాగుతోంది. ఆర్ఓఈ, ఆర్ఓసీఈ విలువ వరుసగా 42.4 శాతం, 51.8 శాతంగా నమోదయ్యాయి. విండ్ ఎనర్జీ ఇండస్ట్రీలో ప్లాంట్ సొల్యూషన్స్ అందిస్తుంటుంది. విండ్ ఫామ్స్ అభివృద్ధిలో ఈ కంపెనీ సేవలందిస్తుంటుంది.












Click it and Unblock the Notifications