ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: మంత్రాలయం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video

2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మంత్రాలయం కొత్తగా ఏర్పాటైంది. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి మంత్రాలయం, పెద్దకడుబూరు, కోసిగి మండలాలతో పాటుగా ఆదోని సెగ్మెంట్ నుండి కౌతాళం మండలాన్ని కలిసి ఈ మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడింది. గతంలో ఆదోని నియోజకవర్గంగా ఉన్న ఆ ప్రాంతం..2009 నుండి మంత్రాల యం నియోజకవర్గం గా మారింది. ఇక్కడ 2004 లో గెలిచి..2009 లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్ధి సాయి ప్రసాదరెడ్డి సోదరులు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కాగా, మరో సోదరుడు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి. ఇక్కడి నుండి టిడిపి అభ్యర్ధిగా మీనాక్షి నాయుడు మూడు సార్లు గెలుపొందారు. రాయచోటి రామయ్య రెండు సార్లు, హెచ్ సత్యనారాయణ రెండు సార్లు గెలిచారు. కాగా, ఈ నియోజకవర్గం కర్నూలు లోక్‌సభ పరిధిలోకి వస్తుంది.
ఆదోని లో 13 సార్లు..మంత్రాలయం లో రెండు సార్లు ఎన్నికలు..
1952 నుండి 2004 వరకు ఆదోని నియోజకవర్గానికి 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి నాలుగు సార్లు, పిఎస్పి ఒకసారి, ఇద్దరు ఇండిపెండెంట్లు నెగ్గారు. ఇక, 2009 లో ఏర్పడిన మంత్రాలయం నియోకవర్గం లో ఇప్పటి వరకు రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. 2209 లో టిడిపి నుండి పోటీ చేసిన బాలనాగి రెడ్డి గెలుపొందారు. ఆ తరు వాత వైసిపి లో చేరిన బాలనాగిరెడ్డి 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన సోదరుడు సాయిప్రసాద రెడ్డి ఆదోని నుండి గెలిచారు. మరో సోదరుడు వెంకట్రామి రెడ్డి గుంతకల్ నుండి పోటీ చేసి ఓడిపోయారు.

2014 లో వైసిపి గెలుపు..
2014 ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గం లో మొత్తం ఓటర్లు 179666 మంది ఉండగా, అందులో 139116 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసిపి నుండి పోటీ చేసిన బాలనాగిరెడ్డికి 69858 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన తిక్కారెడ్డికి 62396 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్ధి బాలనాగి రెడ్డి 7462 ఓట్ల ఆధిక్యంతో గెలుపాందారు. ప్రస్తుతం అక్కడ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. టిడిపి నుండి అభ్యర్ధి మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications