కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ మాట నేత‌లు..అధికారులు భేఖాత‌ర్‌: క‌క్ష్య‌కట్టి ఇలా చేస్తారా: సీఎంకు రోజూ లేఖ రాస్తా..అఖిల‌..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాజీ సీఎం చంద్ర‌బాబు మీద క‌క్ష్య క‌ట్టి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. సీఎం మాట‌ల‌ను క్షేత్ర స్థాయిలో నేత‌లు.. అధికా రులు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని విమ‌ర్శించారు. అవినీతి ర‌హిత పాల‌న అందిస్తామ‌ని సీఎం చెబుతున్నార‌ని.. త‌మ జిల్లాలో జ‌రిగే ప్ర‌తీ చిన్న అవినీతి పైనా ప్ర‌తీ రోజూ ముఖ్య‌మంత్రికి లేఖ రాస్తామ‌ని చెప్పుకొచ్చారు.

జ‌గ‌న్ మాట ఎవ‌రూ విన‌ట్లేదు..
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చెప్పినా ఆయ‌న మాట‌ను అధికారులు..క్షేత్ర స్థాయిలో నేత‌లు విన‌టం లేద‌ని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ పాల‌న పైనా తొలి సారిగా అఖిల స్పందించారు. త‌ల్లి మ‌ర‌ణం త‌రువాత వైసీపీ నుండి ఎమ్మెల్యేగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన అఖిల ఆ త‌రువాత టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయ్యారు. అప్ప‌టి నుండి జ‌గ‌న్ పైన విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. నంద్యాల ఎన్నిక‌ల స‌మ‌యంలో అఖిల త‌న సోద‌రుడు బ్ర‌హ్మానంద రెడ్డి గెల‌వ‌క‌పోతే తాను రాజకీయ స‌న్యాసం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత కొంత కాలంగా మౌనంగా ఉన్న అఖిల ఇప్పుడు తిరిగి జ‌గ‌న్ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టారు. కేవలం చంద్రబాబు నాయుడుపై కక్షకట్టి ఇలా ప్రజావేదికను కూల్చేయడం తగదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గృహంతో అక్కడ అనాథాశ్రమాలు, ఆసుపత్రులు, కాటేజీలు ఉన్నాయని, వాటిని కూడా కూల్చేస్తారా అని ప్రశ్నిం చారు అఖిల‌.

Bhuma Akhila Priya serious comments on CM Jagan. She says ruling party leaders and officers do not care CM

జ‌గ‌న్‌కు రోజూ లేఖ రాస్తా..
కేవ‌లం చంద్ర‌బాబు నిర్మించార‌నే కార‌ణంతో ప్ర‌జా వేదిక‌ను కూల్చేయ‌టం కాద‌ని..రాష్ట్రం మొత్తంగా ఉన్న అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను తొలిగిస్తే తాము స్వాగ‌తిస్తామ‌ని అఖిల చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అవినీతి అనేది లేకుండా చేస్తామంటూ జ‌గ‌న్ చెబుతున్నార‌ని.. అయితే, క్షేత్ర స్థాయిలో ప‌రిస్థితి ఆ విధంగా లేద‌ని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న అవినీతి జరిగిన నేరుగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాస్తామని అన్నారు. అవినీతిరహిత పాలన సీఎం ఎలా చేస్తారో గమనిస్తామని మాజీ మంత్రి అఖిల పేర్కొన్నారు.లా అండ్‌ ఆర్డర్‌ సమస్య రాకూడదని ఇటీవల జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పిన మరుసటి రోజే మంగళగిరిలో హత్య జరిగిందని గుర్తు చేశారు.
జ‌గ‌న్ అధికార బాధ్య‌త‌లు స్వీక‌రించి నెల రోజుల పూర్తి కాకుండానే టీడీపీ నేత‌లు ఒక్కోక్క‌రిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. జ‌గ‌న్ ల‌క్ష్యంగా ఆరోప‌ణ‌లు మొద‌లు పెడుతున్నారు. మ‌రి..ఇప్పుడు వైసీపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

English summary
Ex Minister Bhuma Akhila Priya serious comments on CM Jagan. She says ruling party leaders and officers do not care CM orders in ground level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X