శ్రీశైలానికి సీజేఐ ఎన్వీ రమణ: షెడ్యూల్ ఇదే

కర్నూలు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కర్నూలు జిల్లాకు రానున్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానాన్ని దర్శించుకోనున్నారు. సతీసమేతంగా ఆయన శ్రీశైలానికి వెళ్లనున్నారు. ఈ సాయంత్రం 6:30 గంటలకు ఆయన శ్రీశైలానికి చేరుకుంటారు. జిల్లా కలెక్టర్ పీ కోటేశ్వర రావు, దేవస్థానం పాలక మండలి ఛైర్మన్, ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎన్వీ రమణ దంపతులకు స్వాగతం పలకనున్నారు. అనంతరం మల్లికార్జునుడు, భ్రమరాంబ అమ్మవారిని ధూళి దర్శనం చేసుకుంటారు రాత్రి అక్కడే బస చేస్తారు.

సోమవారం తెల్లవారు జామున మల్లన్నను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కల్యాణోత్సవం, కంచిమఠంలో హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో ఎన్వీ రమణ దంపతులు పాల్గొంటారు. ఆయన రాకను పురస్కరించుకుని జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ నుంచి విమానంలో కర్నూలు శివార్లలోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో ఆయన శ్రీశైలానికి వెళ్తారు.

CJI NV Ramana will visit Srisailam temple in Kurnool today

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తరచూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తోన్నారు. తెలంగాణలో యాదాద్రి సహా శ్రీశైలం దేవస్థానాన్ని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలను దర్శించారు కొద్దిరోజుల కిందటే మరోసారి ఆయన శ్రీవారిని దర్శించారు. 2021 డిసెంబర్‌లో ఆయన సతీ సమేతంగా కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామం పొన్నలూరులో పర్యటించారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని సందర్శించారు.

ప్రస్తుతం జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. శనివారం గచ్చిబౌలిలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ హిమా కోహ్లి, తెలంగాణ హైకోర్టు సీజే సతీశ్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్‌, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇందులో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+