ఆమె పంట పండింది ... 4 క్యారెట్ల డైమండ్ దొరికింది .. గతంలోనూ ఇద్దరికి
కర్నూలు, అనంతపురం జిల్లాలలో వర్షాకాలంలో వజ్రాల కోసం వేట కొనసాగుతుంది . చాలా మంది పని గట్టుకుని వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తారు. రోజంతా పొలంలోనే ఉండి తళతళ మెరిసే రాళ్ల కోసం, వజ్రాల కోసం వెదుకులాట సాగిస్తారు.తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. తాజాగా కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి వద్ద ఒక మహిళకు అదృష్టం వరించింది . వజ్రం దొరికింది .

పగిడిరాయిలో ఓ మహిళకు దొరికిన నాలుగు క్యారెట్ల వజ్రం
పొలం పనులు చేసుకుంటున్న సమయంలో పగిడిరాయిలో ఓ మహిళకు నాలుగు క్యారెట్ల వజ్రం దొరికింది. ప్రతి సంవత్సరం తొలకరి వర్షాలు కురిసిన తరువాత అక్కడి వారికి వజ్రాలు దొరకడం, వజ్రాల కోసం వారు అన్వేషణ సాగించడం పరిపాటి. ఇదే క్రమంలో వ్యవసాయ పనులు చేస్తున్న మహిళకు వజ్రం లభించగా దానిని ఆమె గుత్తి లోని ఓ వజ్రాల వ్యాపారికి మూడున్నర లక్షల రూపాయలకు విక్రయించినట్లు గా తెలుస్తుంది.

గతంలో గొర్రెల కాపరికి దొరికిన వజ్రం
ఈసారి వర్షాకాలం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు నాలుగు నెలల కాలంలో ముగ్గురికి వజ్రాలు దొరికాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.
గతంలోనూ పగిడిరాయి, బొల్లవానిపల్లె పొలాల్లో ఇద్దరికీ రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. బొల్లవాని పల్లె గొర్రెల కాపరికి వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని ఆ గొర్రెల కాపరి రూ. 13 లక్షల 50 వేలు, ఐదు తులాల బంగారానికి ఓ వ్యాపారికి అమ్మాడు. ఇక ఆ వజ్రం విలువ సుమారు 60 లక్షలు ఉంటుందని అప్పట్లో పెద్ద చర్చే జరిగింది .

వ్యవసాయ కూలీకి కూడా దొరికిన వజ్రం .. ఆ జిల్లాలపై వజ్రాల వ్యాపారుల కళ్ళు
అలాగే పగిడిరాయిలో వ్యవసాయ కూలీకి కూడా ఒక వజ్రం దొరికినట్టు అప్పట్లో వెలుగులోకి వచ్చింది . ఇక అతని వద్ద నుండి రూ. 1.50 లక్షలకు జొన్నగిరి వ్యాపారి ఆ వజ్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
అత్యంత విలువైన వజ్రాలను అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక వజ్రాల వ్యాపారులు ఈ సీజన్ లో కర్నూలు , అనంతపురం జిల్లాలలో తిష్ట వేసి మరీ వజ్రాల కొనుగోళ్ళు చేస్తారు. ఇలా బహిరంగంగా వజ్రాలను కొనుగోలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications