కర్నూలు జిల్లాను ముంచెత్తుతున్న వర్షం ... కర్నూలు-చెన్నై హైవేపై రాకపోకలు బంద్

కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నంద్యాల, గోస్పాడు, బనగానపల్లె, సరివెళ్ల ప్రాంతాలలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

వర్షపునీరు పలు గ్రామాల్లో ఇళ్లలోకి వచ్చి చేరింది. సహాయ కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు . అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Heavy rains in Kurnool district.. Kurnool-Chennai highway bandh

ఇక తాజాగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా జిల్లెలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జాతీయ రహదారిపై జిల్లెల వాగు ప్రవహిస్తున్న కారణంగా కర్నూలు-చెన్నై హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎర్రగుంట్ల గ్రామంలో వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+