ఘోర రోడ్డు ప్రమాదం... పాదచారుల పైకి దూసుకెళ్లిన లారీ... నలుగురి మృతి...

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. సరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామ సమీపంలోని కర్నూలు-కడప జాతీయ రహదారిపై ఓ డీసీఎం పాదచారుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా 15 మంది త్రీవంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానికులు హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ప్రమాదానికి గురైనవారంతా ఎర్రగుంట్ల గ్రామస్తులేనని తెలుస్తోంది. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది పాదచారులు రోడ్డుపై ఉన్నట్లు సమాచారం. క్రిస్మస్ మాసం కావడంతో వీళ్లంతా వేకువ జామునే ప్రార్థనలు చేసేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా లారీ వారిపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఐదు రోజుల క్రితం (డిసెంబర్ 10) కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గరికపాడు ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను మాచర్ల శ్యామ్(60),శారద(55),శ్యామల(38)లుగా గుర్తించారు. భాగ్యలక్ష్మీ,మాన్యశ్రీ(7),గోపి(8),అక్షయ్,సైదులు గాయాలపాలైనట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

three killed as speeding lorry hits walkers lorry in kurnool district

ఈ నెల 7న కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం బొమ్ములూరు సమీపంలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి వున్న లారీని ఓ కారు అతివేగంతో వెనుక నుంచి ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవడంతో మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి.

ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని క్రేన్ సహాయంతో మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా భీమవరంలో ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. మృతులను చీమకుర్తి నాగేశ్వరవు, తాతారావు, కనకదుర్గ రావులుగా గుర్తించిన పోలీసులు.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.

మృతుల్లో ఒకరు విజయవాడ వాసిగా,మరో ఇద్దరు చింతలపూడి మండలం ఎర్రగొండపల్లెకి చెందినవారిగా గుర్తించారు.ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోగా... పోలీసులు ట్రాఫిక్‌ని క్లియర్ చేశారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+