Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల శంఖారావం: కౌంట్‌డౌన్ - ఇంకో 10 నెలలే..!!

మహబూబ్ నగర్: తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించినట్టే కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి సరిగ్గా 12 నెలల సమయం ఉన్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్.. ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గురి పెడుతోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం.

డిసెంబర్ 4న..

డిసెంబర్ 4న..

ఇందులో భాగంగా- ముఖ్యమంత్రి కేసీఆర్.. డిసెంబర్ 4వ తేదీన మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభ ద్వారా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ఆయన పూరిస్తారనే ప్రచారం జిల్లాలో సాగుతోంది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొనున్నారు.

భారీగా జన సమీకరణ..

భారీగా జన సమీకరణ..

కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయడానికి చురుగ్గా పని చేస్తోన్నారు. లక్ష మందికి పైగా ప్రజలను ఈ సభకు సమీకరించాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రజల తరలింపు కోసం సమాయాత్తమౌతోన్నారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లుగా భావిస్తోన్న ఈ సభలో కేసీఆర్ ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది ఆసక్తి రేపుతోంది.

బిజీగా..

బిజీగా..

తన మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా కేసీఆర్ కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నారు. పాత కలెక్టరేట్‌ స్థలంలో ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీని తరువాత మహబూబాబాద్, సూర్యాపేటల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండింటి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.

ఎన్నికలపై..

ఎన్నికలపై..

అసెంబ్లీ ఎన్నికలపై కేసీఆర్ ఇదివరకే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 15వ తేదీన తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో దీనికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. ముందస్తుకు వెళ్లదలచుకోలేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టామనీ అన్నారు. అక్టోబర్ 2023 తరువాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చనే సంకేతాలు ఇచ్చారాయన.

ప్రజలకు అందుబాటులో..

ప్రజలకు అందుబాటులో..

ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వచ్చే 10 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించారు. 2023 డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు బహిరంగ సభల్లో ప్రసంగించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అన్ని జిల్లాల్లో పర్యటనలు చేస్తానని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+