కొందరు శాపనార్థాలు పెట్టారు కానీ.. అద్భుత ప్రయాణంలోనే తెలంగాణ: సీఎం కేసీఆర్
మహబూబ్‌నగర్: ఏ తెలంగాణ కోరుకున్నామో అది సాకారమవుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరేట్ భవనాన్ని, టీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసగించారు.

సంతృప్తి జీవితంలో ముఖ్యమన్న కేసీఆర్
అద్భుతమైన ప్రయాణంలో మనమంతా సాగుతున్నామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇది సాధించామనే సంతృప్తి జీవితంలో చాలా ముఖ్యమని అన్నారు. ఒకప్పుడు పీవీ నర్సిం హారావు ఏర్పాటు చేసిన సర్వేల్ గురుకుల పాఠశాల అందరికీ గర్వకారణమన్న కేసీఆర్.. అదే స్ఫూర్తితోర్తి తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఒక చిన్న గ్రామంలో 127 మందిలో కంటిచూపు సమస్య ఉంది. కంటి వెలుగు పథకం వెనక ఎంతో పరమార్థం ఉంది. అధికారులు అంకితభావంతో కంటివెలుగును విజయవంతం చేయాలి. ఏ పథకం తెచ్చినా.. సమగ్ర చర్చ, ఒక దృక్పథం ఉంటుంది. మహిళలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆర్థికర్థి, సామాజిక సమస్యలు ఉంటాయి. కేసీఆర్ కిట్ పథకం కూడా ఆషామాషీగా తెచ్చిం ది కాదు. గర్భిణీగా ఉన్నప్పుడు ఆదాయం కోల్పోతారనే డబ్బు కూడా ఇస్తున్నాం. టీకాలను నిర్లక్ష్యం ర్ల క్ష్యం చేయొద్దనేద్ద టీకాలు వేయించినప్పుడు డబ్బులు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

శపించిన వారి అంచనాలు తలకిందులు చేశామన్న కేసీఆర్
సామాజిక, మానవీయ దృక్పథంతో పథకాలు తెస్తున్నాం. సంస్కరణలు నిరంతర ప్రక్రియ, ఒక దశతో ముగిసేవి కావు. మన రాష్ట్రం చిమ్మచీకటవుతుందని శపించిన వాళ్లూ ఉన్నారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అద్భుతప్రగతి సాధిస్తున్నాం . ఈ ఎనిమిదేళ్లలో అందించిన సహకారం భవిష్యత్లోనూ కొనసాగాలి అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కలెక్టరేట్, టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్
అంతకుముందు నూతన కలెక్టరేక్ట ట్ భవనంలో ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్. మరోవైపు, మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. నూతన పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు కేసీఆర్. టీఆర్ఎస్ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ముచ్చటించారు. సాయంత్రం 4 గంటలకు ఎంవీఎస్ కాలేజీ మైదానంలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ హైదరాబాద్ చేరుకోనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా మహబూబ్‌నగర్‌లో భారీ బందోబస్తే ఏర్పాటు చేశారు.