బామ్మర్ది విషెస్.. బావ కళ్లల్లో ఆనందం.. లక్ష మెజార్టీ ఖాయమన్న కేటీఆర్
సిద్ధిపేట : బావకు బామ్మర్ది అడ్వాన్స్ విషెస్ చెప్పారు. మీకు లక్ష మెజార్టీ ఖాయం అంటూ బావ కళ్లల్లో ఆనందం నింపారు బామ్మర్ది. ఎన్నికల సందర్భంగా సిద్ధిపేట నియోజకవర్గంలో జరిగింది ఈ ఆసక్తికర ఘటన. అనుకోకుండా కలిసిన ఆపద్ధర్మ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ మధ్య జరిగిన సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకుని తన నియోజకవర్గానికి బయల్దేరిన కేటీఆర్.. సిద్ధిపేట నియోజకవర్గంలో పోలింగ్ సరళి పరిశీలిస్తున్న హరీశ్ రావు అనుకోకుండా ఎదురుపడ్డారు. గుర్రాల గొంది గ్రామం దగ్గర వీరిద్దరూ తారసపడ్డారు. దీంతో ఇద్దరి వాహనాలు ఆపి పలకరించుకున్నారు. ఈ సందర్భంగా "బావ కంగ్రాట్స్.. మీకు లక్ష మెజార్టీ ఖాయం" అంటూ వ్యాఖ్యానించారు. నేను నా నియోజకవర్గానికి వెళుతున్నా.. మీ మెజార్టీలో సగమైనా తెచ్చుకుంటానంటూ సరదాగా మాట్లాడారు కేటీఆర్.
బామ్మర్ది విషెస్.. బావ కళ్లల్లో ఆనందం.. లక్ష మెజార్టీ ఖాయమన్న కేటీఆర్#KTR #TelanganaElections #Harishrao #Siddipet pic.twitter.com/tr8Mtp2Lr4
— Oneindia Telugu (@oneindiatelugu) December 7, 2018













Click it and Unblock the Notifications