నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేఎంవీ జగన్నాథరావు సస్పెండ్, తక్షణం అమల్లోకి ఆదేశాలు: ఈసీ

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉప ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ అభ్యర్థికి కేటాయించిన గుర్తుపై వివాదం నెలకొంది. అధికారం లేకున్నా ఎన్నికల మాజీ అధికారి కేఎంవీ జగన్నాథరావు గుర్తును కేటాయించారు. లేని అధికారాన్ని ఉపయోగించారని ఈసీ పేర్కొంది. ఆ గుర్తును మార్చడం ఇటీవల కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వచ్చాయి.

విచారణ తర్వాత జగన్నాథరావును విధుల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించింది. ఇటు ఆయనపై చర్యలకు ఉపక్రమించి.. సస్పెండ్ చేసింది.. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇవాళ ఉదయం 11 గంటల వరకు ఢిల్లీ పంపాలని ఆదేశించిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.

ex official kmv jaganadha rao suspended by election commission.

ఇటు ఎన్నికల అధికారికి భద్రత కల్పించడంలో విఫలమైన డీఎస్పీపై సీరియస్ అయ్యింది. క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో తెలిపింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు తెలియజేయాలని ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

మునుగోడు బై పోల్ వేళ గుర్తుకు సంబంధించిన వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఈసీ చర్యలు తీసుకుంది. ఇటు మొన్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా చర్చకు దారితీసింది. ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తగిన ఆధారాలు లేవని ఏసీబీ కోర్టు మేజిస్ట్రేట్ రిమాండ్ పిటిషన్ తోసిపుచ్చారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో నేతలు దూసుకెళ్తున్నారు.

English summary
ex official kmv jaganadha rao suspended by election commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X