నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అడ్డదారులు.. ఇతరుల పరీక్షలు రాస్తూ బుక్కైన భార్యాభర్తలు

|
Google Oneindia TeluguNews

కోదాడ : ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలు అడ్డదారులు తొక్కారు. సైడ్ ఇన్‌కం కోసం ఆశపడి దారి తప్పారు. హాయిగా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ.. వేలకు వేల జీతాలు తీసుకుంటూ కూడా అదనపు కాసుల కోసం సైడ్ ట్రాక్‌లోకి వెళ్లారు. చివరకు విధి వక్రీకరించి అడ్డంగా దొరికిపోయారు.
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు భార్యాభర్తలు ఇతరుల పరీక్షలు రాస్తూ అడ్డంగా బుక్కవడం చర్చానీయాంశమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

కలిసిరాని అసెంబ్లీ.. ఊపు తెప్పించిన లోక్‌సభ.. ఇక మున్సిపల్ పోరులో నిలిచి గెలిచేనా? కలిసిరాని అసెంబ్లీ.. ఊపు తెప్పించిన లోక్‌సభ.. ఇక మున్సిపల్ పోరులో నిలిచి గెలిచేనా?

Recommended Video

ప్రజా వేదికను ఖాళీ చేయించిన అధికారులు
ఇతరుల పరీక్షలు రాస్తూ పట్టుబడ్డ ప్రభుత్వోద్యోగులు

ఇతరుల పరీక్షలు రాస్తూ పట్టుబడ్డ ప్రభుత్వోద్యోగులు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అజ్మీర్ వెంకటప్ప.. బానోత్ కవిత దంపతులు. వీరిద్దరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే. మక్కపేటకు చెందిన వెంకటప్ప వత్సవాయి మండలం పోలంపల్లిలో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య కవిత పెనుగంచిప్రోలు పోస్టాఫీసులో పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

అయితే ప్రభుత్వ కొలువులు చేసుకునే ఈ ఇద్దరు కూడా అడ్డదారులు తొక్కారు. అదనపు ఆదాయం కోసం ఆశపడి అడ్డంగా బుక్కయ్యారు. కోదాడలో ఆదివారం నాడు జరిగిన నాగార్జున ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలకు వీరిద్దరు హాజరయ్యారు. వెంకటప్ప బీకాం పరీక్ష రాయగా.. కవిత బీఎస్సీ పరీక్షలు రాశారు.

 కోదాడలో నాగార్జున ఓపెన్ యూనివర్సిటీ లీలలు

కోదాడలో నాగార్జున ఓపెన్ యూనివర్సిటీ లీలలు

ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటకు చెందిన మహ్మద్‌ సల్మాన్, తిరపతమ్మ అనే ఇద్దరు వ్యక్తులు కోదాడలోని నాగార్జున ఓపెన్‌ యూనివర్సిటీకి చెందిన కేంద్రంలో డిగ్రీ చదువుతున్నారు. ప్రస్తుతం ఎంఎస్‌ కళాశాల సెంటర్‌లో జరుగుతున్న ఫైనలియర్‌ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. అయితే వారి స్థానంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు వెంకటప్ప, కవిత ఆ పరీక్షలు రాయడం దుమారం రేపింది.

విషయం కాస్తా లీక్ కావడంతో కొందరు వ్యక్తులు కోదాడ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు పరీక్షా కేంద్రానికి చేరకుని తనిఖీలు నిర్వహించడంతో విషయం బయటపడింది. ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తున్న ఇద్దరిని గుర్తించారు. వెంకటప్ప, కవితను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఇష్టారాజ్యంగా పరీక్షలు.. అడ్డగోలుగా వసూళ్లు

ఇష్టారాజ్యంగా పరీక్షలు.. అడ్డగోలుగా వసూళ్లు

కోదాడలోని నాగార్జున ఓపెన్ యూనివర్సిటీ కేంద్రంపై అనేక ఆరోపణలున్నాయి. ఇష్టారాజ్యంగా పరీక్షలు నిర్వహిస్తున్నారనే వాదనలున్నాయి. అభ్యర్థుల నుంచి పేపర్‌కు వేయి నుంచి రెండు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే అలా అడ్డదారుల్లో వెళ్లలేక, అదనంగా డబ్బులు ఇవ్వలేని విద్యార్థులను నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కొకొల్లలు.

నిర్వాహకులు అడిగినంత మేర డబ్బులిచ్చిన అభ్యర్థులను ఒకరకంగా చూస్తూ.. డబ్బులు ఇవ్వలేనివారిని మరో రకంగా చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఇచ్చినవారిని ప్రత్యేకంగా ఇతర రూముల్లో కూర్చోబెడుతూ పరీక్షలు రాయిస్తున్నట్లు తెలుస్తోంది. అదలావుంటే ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాసే పైలటింగ్ విధానానికి దాదాపు 10 వేల రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.

దివ్యాంగుడే.. కానీ మామూలోడు కాదు.. ప్రకాశం జిల్లా గ్యాంగ్ రేప్‌లో కొత్త కోణాలుదివ్యాంగుడే.. కానీ మామూలోడు కాదు.. ప్రకాశం జిల్లా గ్యాంగ్ రేప్‌లో కొత్త కోణాలు

ప్రమోషన్ల కోసం పట్టాలు.. నిర్వాహకులకు కాసుల పంట

ప్రమోషన్ల కోసం పట్టాలు.. నిర్వాహకులకు కాసుల పంట

సాధారణంగా ప్రైవేట్‌గా డిగ్రీలు చదివేవారిలో ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువగా కనిపిస్తారు. డిగ్రీ పట్టా ఉంటే ప్రమోషన్లకు ఉపయోగపడుతుందనే కారణంతో చాలామంది ఓపెన్ యూనివర్సిటీలను ఆశ్రయిస్తుంటారు. దాంతో ఓపెన్ యూనివర్సిటీ కేంద్రాల నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. డిగ్రీ పట్టా ఇప్పిస్తామంటూ వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మొత్తానికి కోదాడ నాగార్జున ఓపెన్ యూనివర్సిటీ కేంద్రం నిర్వాహకుల తీరు బయటపడటంతో పలువురు మండిపడుతున్నారు.

English summary
Government Employees Wife and Husband Written others Exams and caught by Officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X