మునుగోడులోనే ఉంటా: రేవంత్ రెడ్డి, స్వయంగా పర్యవేక్షణ, ఎప్పటి నుంచి అంటే
అన్నీ పార్టీలు మునుగోడు బై పోల్‌పై ఫోకస్ చేశాయి. తమ పార్టీ విజయం సాధించాలని, ఆ మేరకు కసరత్తు చేస్తున్నాయి. మునుగోడులోనే ఉండి వ్యుహారచన చేయనున్నాయి. ఈ ప్రణాళికలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందు వరసలో ఉన్నారు. అవును.. సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని ఆ పార్టీ అనుకుంటుంది. బరిలో దిగేందుకు నేతల మధ్య విభేదాలు ఉన్నా.. అందరినీ కలుపుకుపోదామని అంటున్నారు.

ప్రజల తరఫున
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో గల సర్పంచ్, ఉప సర్పంచ్‌లను కొంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్కరూ కూడా పార్టీ మారొద్దని కోరారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా నిలబడదామని చెప్పారు. ఒక్క ఏడాది ఓపిక పడితే కాంగ్రెస్ పార్టీదే అధికారమని చెప్పారు.

భవిష్యత్ నిర్ణయించనుంది
ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని అన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి తాను మునుగోడులో ఉంటానని చెప్పారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. తమ పార్టీ విజయం ఖాయం అనే ధీమాతో ఉన్నారు. ఆ మేరకు జోరుగా ప్రచారం చేసే అవకాశం ఉంది. అందుకే తాను మునుగోడులో ఉంటానని వివరించారు.

స్వార్థపరులే
కాంగ్రెస్ పార్టీ వాడుకొని ఎదిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం పార్టీని, తనను ఎన్నుకున్న ప్రజల్ని మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి కింద కుక్కల్లా కాంగ్రెస్‌లో ఎదిగి న కోమటిరెడ్డి బ్రదర్స్.. చివరికి ద్రోహులుగా మారారని ఘాటుగా విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు కానున్నాయని జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications