వందల కోట్లతో ఢిల్లీ నుంచి బ్రోకర్ గాళ్లు: ఆ ‘నలుగురి’కి కేసీఆర్ జేజేలు
నల్గొండ: మునుగోడు ఉపఎన్నిక అవసరం లేకుండా వచ్చిందని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. చండూరులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితం కూడా అందరికీ తెలుసని, ఎప్పుడో తేల్చేశారన్నారు.

కారు గుర్తుకు ఓటేయాలన్న కేసీఆర్
గత
వారం
రోజులుగా
జరుగుతున్న
పరిణామాలు
అన్ని
ప్రజలకు
తెలుసు.
అన్ని
విన్నరు.
ఎన్నికలు
రాంగానే
గత్తరగత్తర
లొల్లి.
విచిత్ర
వేషగాళ్లు,
డ్యాన్సులుంటాయి.
కేసీఆర్
చెప్పిన
విషయాన్ని
చర్చించుకోండి.
నిజాలు
తేల్చండి.
ఒళ్లు
మర్చిపోయి
వేస్తే
ఇళ్లు
కాలిపోతది.
మునుగోడు
బాగుపడాలతంటే
కారు
గుర్తుకు
ఓటు
వేయండి.
వీరభద్రం
చెప్పారు..
దేశంలో
ఏం
జరుగుతోంది?
కరిచే
పామును
మెడలేసుకుంటామా?
అని
కేసీఆర్
వ్యాఖ్యానించారు.
ఢిల్లీ నుంచి బ్రోకర్ గాళ్లంటూ కేసీఆర్.. ఆ నలుగురికి జేజేలు
'నాతోపాటు
నలుగురు
తెలంగాణ
బిడ్డలు
వచ్చారు.
న్నిమొన్న
ఢిల్లీ
బ్రోకర్
గాళ్లు
తెలంగాణ
ఆత్మగౌరవాన్ని
కొనాలని
వచ్చారు.
వందకోట్లు
ఇస్తాం
రమ్మంటే
ఎడమ
కాలుతో
చెప్పుతో
కొట్టి..
అంగట్లో
సరుకులం
కాదని
చెప్పి..
హిమాలయ
పర్వతమంతా
ఎత్తున
ఎమ్మెల్యేలు
నిలిచారు.
తాండూరు
ఎమ్మెల్యే
రోహిత్
రోడ్డి..
అచ్చంపేట
ఎమ్మెల్యే
గువ్వల
బాలరాజు..
కొల్లాపూర్
ఎమ్మెల్యే
హర్షవర్ధన్..
పినపాక
ఎమ్మెల్యే
రేగా
కాంతారావు..
ఇలాంటివాళ్లు
కావాలి.
అంగట్లో
పశువుల్లా
అమ్ముడు
పోలేదు.
వీరికి
గట్టిగా
స్వాగతం
పలకాలి.

ప్రధాని మోడీకి ఇంకేం కావాలంటూ కేసీఆర్ ఫైర్
20-30
మంది
ఎమ్మెల్యేలను
కొనుగోలు
చేసి
తెలంగాణ
ప్రభుత్వాన్ని
పడగొట్టాలని
చూశారు.
మోడీ
ఇంకా
ఏం
కావాలి?
ప్రధాని
అయ్యారు
రెండు
సార్లు.
ఎందుకీ
దుర్మార్గం
అరాచకం.
ఏరకంగా
మంచిది?
మోడీ
అండదండలు
లేకుండానే
ఆర్ఎస్ఎస్
సంబంధిత
వ్యక్తులు
ఇక్కడికి
వచ్చారా?
వారంతా
జైల్లో
ఉన్నారు.
ఇదంతా
జరుగుతుంటే
మౌనంగా
ఉందామా?
అని
కేసీఆర్
ప్రశ్నించారు.

కేంద్రం కార్పొరేట్ల జేబులు నింపుతోందంటూ కేసీఆర్
చేనేత
ఉత్పత్తులపై
5
శాతం
జీఎస్టీ
విధించారు
ప్రధాని
మోడీ.
దీంతో
మనమంతా
పోస్టుకార్టు
ఉద్యమం
ప్రారంభించాం.
వామపక్షాలు,
టీఆర్ఎస్
కలిసి
పోరాడుతున్నాయి.
చేనేతపై
జీఎస్టీ
విధించిన
పార్టీకి
ఓటు
వేద్దామా?
బీజేపీకి
ఓటు
వేయొద్దు
అని
ముఖ్యమంత్రి
కేసీఆర్
మునుగోడు
ప్రజలకు
పిలుపునిచ్చారు.
దేశంలో
24
గంటల
విద్యుత్
అందిస్తున్నది
తెలంగాణ
మాత్రమే
అని
అన్నారు.
కేంద్రం
కార్పొరేట్
జేబులు
నింపేందుకే
పనిచేస్తోందన్నారు.
విద్యుత్
సంస్కరణల
పేరుతో
మోటార్లకు
మీటర్లు
పెడతామని
అంటున్నారు..
ఇళ్లల్లోని
మీటర్లకు
కూడా
రూ.
30వేలు
కట్టి
మీటర్లు
పెట్టుకోవాల్సి
వస్తుంది
అని
కేసీఆర్
అన్నారు.
మోటర్లు
పెట్టేవారికే
మీటర్లు
పెడతామని
పిలుపునిచ్చారు.