గడీల పాలనకు చరమగీతం పాడాల్సిందే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ స్పీచ్ ఇస్తున్నారు.. రాష్ట్రంలో ప్రతీపక్షాలనే లెక్క చేయడం లేదు. కానీ బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ మాత్రం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న సీఎం కేసీఆర్‌ గడీల పాలనను అంతమొందిస్తానని ఆయన హెచ్చరించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని కొమ్మాల, లోయపల్లి, జాజిరెడ్డిగూడెం, తిమ్మాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు.

ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న రాక్షస పాలనను గద్దె దించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ మాయమాటలతో పేదలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే పేదలు బాగుపడతారని చెప్పారు. అదీ తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. ఇటు ఇసుక మాఫియాపై ప్రశ్నించిన ప్రజలపై పోలీసులతో కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. ఇదీ మంచి పద్దతి కాదన్నారు. అన్నీ వర్గాలకు.. దళితులనే చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు.

trs party Distance to power:rs praveen kumar

దళితులకు రాజ్యాధికారం కావాలని.. దాంతోనే బలహీనవర్గాల డెవలప్ అవుతారని ప్రవీణ్ నమ్ముతారు. అందుకే బీఎస్పీలో చేరి.. జనాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. పనిలో పనిగా.. అధికార పార్టీ దుమ్ము దులుపుతున్నారు. ఇటు అంతకుముందు కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన పరిస్థితులు వేరుగా ఉన్నాయని, ఇప్పుడా పరిస్థితులు లేవని కేసీఆర్ అన్నారు. తాము చేపట్టిన పనులు పూర్తి చేయడానికి సమయం సరిపోతుందన్నారు. గతంలో ఎన్నికలకు వెళ్లిన సమయంలో 88 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సారి 95 నుంచి 105 సీట్లలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. 30 సీట్లలో సర్వే చేశారని.. అందులో 29 స్థానాల్లో గెలుస్తామని తేలిందన్నారు. కానీ ప్రవీణ్ కుమార్ మాత్రం.. తామే మెజార్టీ స్థానాలను గెలుస్తామని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+