8 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. 11 రోజుల పాటు వేడుకలు
యాదాద్రి భువనగిరి : లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట ముస్తాబైంది. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తిచేశారు ఆలయ అధికారులు. కనివినీ ఎరుగనిరీతిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి, యాదాద్రి ప్రతిష్ట మరింత పెంచేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి.
మరో రెండు రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో ఆలయ అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 11 రోజుల పాటు ఉదయం సమయంలో అలంకార సేవలు, రాత్రి సమయాల్లో శ్రీవారి వాహనసేవలు ఉంటాయని ఈవో తెలిపారు. 15వ తేదీ ఉదయం జరిగే కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ విశిష్ట అతిథిగా రానున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు వివరించారు.













Click it and Unblock the Notifications