మార్చి 28న యదాద్రి పున:ప్రారంభం.. జర్నలిస్టులకు కాలనీ: సీఎం కేసీఆర్
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ పునః ప్రారంభ ముహూర్త పత్రికను దేవస్థానం ఈవోకు అందజేశారు. ముహూర్త పత్రికను స్వామి పాదాల చెంత ఉంచాలని సూచించారు. త్రిదండి రామానూజ చినజీయర్ స్వామి ముహూర్త పత్రిక రాసి ఇచ్చారు. 10 వేల మంది రుత్వికులతో సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. మార్చి 28వ తేదీన పున:ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. హోమాన్ని చినజీయర్ స్వామి పర్యవేక్షిస్తారని చెప్పారు.

బిజీ బిజీ
ఉదయం నుంచి సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం.. ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. గండి చెరువు, పుష్కరణి, కల్యాణకట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రతమంటపం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లు, గర్భాల ద్వారాలు, బంగారు తాపడాలు, ఆళ్వార్ మంటపం పనులను పరిశీలించారు. క్యూకాంప్లెక్స్, ఎస్కలేటర్స్, శివాలయం, విష్ణు పుష్కరిణితో పాటు క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం, ధ్వజస్తంభం ఏర్పాటు చేసిన వేదికను సైతం పరిశీలించగా.. పనుల పురోగతిని సీఎంకు ఆలయ స్తపతి ఆనంద్‌సాయి వివరించారు.

సూచనలు
తుది పనులపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీఎం కేసీఆర్ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించారు. రింగు రోడ్డు కోసం షాపింగ్ స్థలాలు కోల్పోయిన వారికి కల్యాణ కట్ట సమీపంలో వేయి స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని సూచించారు.
Recommended Video

జర్నలిస్ట్ కాలనీ
ఇటు యాదాద్రిలో జర్నలిస్ట్‌లకు ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు అడిగినట్లు మోత్కుపల్లి నర్సింహులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ మేరకు ఇళ్ల స్థలాలలు కేటాయించే బాధ్యతను అప్పగిస్తూ మంత్రికి ఆదేశాలిచ్చారు. మంత్రి, కలెక్టర్, వైటీడీఏ అధికారులు చర్చించి.. ఎలా కేటాయించాలో చర్యలు తీసుకుంటారన్నారు. 'యాదాద్రి జర్నలిస్ట్ కాలనీ' అంటేనే గొప్పగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుందామన్నారు. క్షేత్రమెంత గొప్పగా బాగుంటుందో.. కాలనీ కూడా అంత గొప్పగా ఉండాలని.. దాంతో మనకు కారణంగా నిలుస్తుందన్నారు. జర్నలిస్టులు వార్తల వాహకులని.. ఆలయ నిర్మాణానికి సంబంధించి, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రం, ఆధ్యాత్మిక సంపదను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు క్షేత్రానికి సంబంధించిన ప్రత్యేక పరిశోధన వ్యాసాలు, కథనాలు రాయాలని మీడియా ప్రతినిధులను కోరారు.
-
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు












Click it and Unblock the Notifications