కేసీఆర్ నియంత.. చరమగీతం పాడాల్సిందే: షర్మిల
ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర భాగంగా షర్మిల మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించాడని దుయ్యబట్టారు. గత ఏడు సంవత్సరాల పాలనలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా కేసీఆర్‌కు చలనం లేదని తప్పుబట్టారు. కొట్లాడి సాధించుకున్న రాజ్యంలో పాలన ఆశించిన విధంగా లేదన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ అవసరమని షర్మిల అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కేవలం మూడు వేల మంది వరకే రూ.25వేల వరకు రుణమాఫీ చేసి 36 లక్షల మంది రైతులకు మొండి చెయ్యి చూపారని మండిపడ్డారు. రైతులకు పంట పండించే హక్కులేనప్పుడు పొలాలు ఉండి ఏం లాభమని షర్మిల ప్రశ్నించారు.
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని పీ.కే మల్లెపల్లి గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమం జరిగింది. ప్రజలకు వైయస్ షర్మిల హామీ ఇచ్చారు. రాబోయే వైయస్ఆర్ ప్రభుత్వంలో అభయహస్తం, కరోనా బిల్లులు చెల్లిస్తామని వైయస్ షర్మిల గారు హామీ నిచ్చారు. నా కొడుకు కరోనా వచ్చి చనిపోయిండు. 3లక్షల రూపాయలు అప్పు తెచ్చి ప్రయివేటు వైద్యం చేయించాను. అయినా కూడా బతకలేదు. ఆ అప్పు కట్టేందుకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం అని ఓ అవ్వ తెలిపింది. గ్యాస్ ధర 400 రూపాయలు ఉంటే, 1100 పెరిగింది. రైతులకు రుణమాఫీ కాలేదు. అప్పుడు తెచ్చుకున్న రుణాల డబ్బులు బ్యాంకుల్లో మిత్తి పెరిగి 20వేల రూపాయలు కాస్తా లక్ష రూపాయలు అయ్యాయి. మా ఊరు పేరు మీద ఒక బోరు ఉంది. నీళ్లు వారానికి ఒకసారి వస్తాయి. మోరీలు కూడా మా ఊరికి లేవు.

మా ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయ్యింది. ఎన్నికల్లో మందు పోస్తే తాగి అనారోగ్యంతో చనిపోయాడు. నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్లకు పెళ్లి ఎలా చేయాలో తెలియడం లేదు. పింఛన్ కూడా రావడం లేదు. పింఛన్ కోసం సర్పంచ్ దగ్గరకు వెలితే నా పింఛనే వస్తలేదు. మీకు ఎలా ఇవ్వాలని అంటున్నారు.
సబ్సులు, పప్పులు, నిత్యావసర సరుకులకు ధరలు పెరిగాయి. భూమి ఉన్న వారికే రైతు బంధు వస్తోంది. మాకు ఇల్లు కూడా లేదు. మేము ఎలా బతకాలమ్మా..? వైయస్ఆర్ హయంలో డిండీ ప్రాజెక్టు కాల్వ తొవ్విర్రు. నీళ్ల కోసం ఆ తవ్విన కాల్వలకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నాం. పెద్దకొడుకు అన్నందుకు మామ్మల్ని నట్టేట ముంచిండు. నాకు ఇద్దరు కొడుకులు చదువుకుని పత్తి బత్తాలు మోస్తున్నరు అని ఓ పెద్దావిడ ఆవేదన. మా ఊర్లో పని లేక వలసలు పోతున్నారు. గ్యాస్ ధర పెరిగడంతో గుట్టలు ఎక్కి కట్టేలు తెచ్చుకుని వండుకునే పరిస్థితి వచ్చింది. ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఓ పెద్దాయన ఆవేదన వ్యక్తం చేశారు.
సాయిరెడ్డి గూడెంలో రోడ్డు, మోరీ, ఇండ్లు, భూమి కూడా లేదు. వైయస్ఆర్ గారు కట్టించిన ఇండ్లలోనే ఇప్పటికీ ఉంటున్నాం అని ప్రజలు తెలిపారు. నా పేరు మహేష్ మేడం. డిగ్రీ చదివి ఇంట్లోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. మా అమ్మానాన్నలు తలెత్తుకుని తిరగలేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగాలు వచ్చేలా చూడండి మేడం. పత్తి పంట వేసినం మేడం. ధర తక్కువగా ఉంది. కూలీలకు చెల్లించేందుకే వచ్చిన పంట డబ్బులు అయిపోతున్నాయి. తెచ్చిన అప్పు అలానే ఉంటోంది. ప్రతీ సంవత్సరం ఇలానే గడుస్తోంది మేడం. రైతులకు న్యాయం చేయాలని ఓ పెద్దావిడ తెలిపింది. పిల్లలు బస్సు ఎక్కాలంటే పీ.కే. మల్లెపల్లి నుంచి కుర్మేడు గ్రామం దాకా పోవాల్సివస్తోంది. బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని గ్రామ ప్రజలు తెలిపారు. వైయస్ఆర్ హయంలో రైతులకు న్యాయం చేసిండు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలను తీర్చడం లేదని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు పెళ్లాం చచ్చిపోయింది. నా కొడుకుకు నలుగురు పిల్లలు ఉన్నారు. మా కొడుకును ఆదుకోవాలని ఓ అవ్వ వేడుకుంది. అభయహస్తం 5 ఏండ్లు కట్టినం. అభయహస్తం గురించి అధికారులను అడిగితే అది తీసేసిండ్రు అని చెబుతున్నారు. వృద్ధులకు అభయహస్తంతో డబ్బులు వస్తయని అనుకుంటే అవన్నీ తీసేసి పేదలను ఇబ్బంది పెడుతున్నారని ఓ పెద్దవిడ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా పలువురు విన్నవించుకున్నారు.












Click it and Unblock the Notifications