పోతిరెడ్డి పాడుపై చంద్రబాబు కీలక నిర్ణయం?- 1న సందర్శన

Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి కార్యక్రమం, అమలు చేసిన తొలి హామీ పింఛన్ల పంపిణీ. ఈ నెల 1వ తేదీన రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం ఆరంభమైంది.

ఇప్పుడు మరోసారి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతోన్నారు చంద్రబాబు. ఈ సారి ఆయన శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మడకశిరలో పింఛన్లను పంపిణీ చేయనున్నారు. స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి 4,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అందజేయనున్నారు.

CM Chandrababu to visit Srisalam on August 1

మడకశిర మండలంలోని గుండుమల ఎస్సీ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యాక్రమంలో ఆయన పాల్గొంటారు. జులై నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడే రచ్చబండను నిర్వహించనున్నారు. పింఛన్ లబ్దిదారులతో ముఖాముఖి చర్చిస్తారు.

అక్కడి నుంచి ఆయన నేరుగా నంద్యాల జిల్లాకు బయలుదేరి వెళ్తారు. శ్రీశైలంలో పర్యటిస్తారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీశైలం రిజర్వాయర్‌ను సందర్శిస్తారు. కొత్తగా వస్తోన్న వరద ప్రవాహం, నీటి మట్టం గురించి అధికారులను అడిగి తెలుసుకుంటారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు.

ఈ పర్యటనలో ఆయన వెంట జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ ఫరూక్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సహా నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

అక్కడే జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలకు కృష్ణా నీటిని తరలించడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మితమైన పోతిరెడ్డి పాడు వివరాలపై ఆరా తీస్తారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు నుంచి మరిన్ని కృష్ణాజలాలను రాయలసీమ జిల్లాలకు తరలించడానికి గల అవకాశాలను పరిశీలిస్తారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+