Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే- క్లారిటీ ఇచ్చేసినట్టే..!!

వైఎస్ఆర్సీపీకి చెందిన శ్రీశైలం శాసన సభ్యుడు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతోన్నారంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. ఆయన స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.

నంద్యాల: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లినట్టే కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో బహిరంగ సభల్లో ఆయన చేస్తోన్న ప్రసంగాలను వింటే ఎవ్వరికైనా అలాంటి అభిప్రాయాలే ఏర్పడతాయి. దీనికితోడు- పార్టీ నాయకులతో వర్క్‌షాప్ లను నిర్వహిస్తూ వస్తోన్నారాయన. 175కు 175 స్థానాలను సాధించి తీరాల్సి ఉంటుందంటూ దిశానిర్దేశం చేస్తోన్నారు.

తెలంగాణలో బతకడం అంటే..మందుపాతర మీద ఉన్నట్టే: షర్మిల

ఎన్నికల వేడి

ఎన్నికల వేడి

అటు తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లో ఉండేలా ప్రణాళికలను వేసుకుంటోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి.. కాన్సెప్ట్ తో జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. ప్రజలను కలుసుకుంటోన్నారు. తన హయాంలో చోటు చేసుకున్న అభివృద్ధిని ఏకరువు పెడుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తోన్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోందీ యాత్ర.

ఇప్పటికే ఇద్దరు..

ఇప్పటికే ఇద్దరు..

ఈ పరిస్థితుల్లో వివిధ పార్టీల నుంచి వలసలు చోటు చేసుకుంటోన్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. టికెట్ దక్కే అవకాశం లేని సిట్టింగ్ శాసన సభ్యులు, ఆశావహులు.. ఇతర పార్టీల వైపు చూపులు సారిస్తోన్నారనే ప్రచారం ఊపందుకుంటోంది. నెల్లూరు రూరల్, తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి.. ఇతర పార్టీల్లో టికెట్ల కోసం తమ వంతు ప్రయత్నాలు సాగిస్తోన్నారు.

అదే లిస్ట్ లో..

అదే లిస్ట్ లో..

తాజాగా- వైఎస్ఆర్సీపీకే చెందిన నంద్యాల జిల్లా శ్రీశైలం శాసన సభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా అదే జాబితాలో చేరబోతోన్నారంటూ వార్తలు వచ్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు మరోసారి టికెట్ దక్కే అవకాశాలు లేవని, ఫలితంగా తన సొంతగూటికి చేరుకుంటారనేది వాటి సారాంశం. దీనికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనీ చెబుతున్నారు. టీడీపీ కండువాను కప్పుకోవడం ఇక లాంఛనప్రాయమేననే ప్రచారం సాగుతోంది.

 క్లారిటీ..

క్లారిటీ..

దీనిపై తాజాగా శిల్పా చక్రపాణిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ ఫిరాయించబోతోన్నానంటూ వస్తోన్న వార్తలను తోసిపుచ్చారు. తాను టీడీపీలో చేరుతానంటూ జరుగుతోన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు శాసన మండలి సభ్యత్వాన్ని త్యాగం చేసి వైఎస్ఆర్సీపీలోకి వచ్చానని గుర్తు చేశారు. మళ్లీ టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మంత్రి పదవి రావొచ్చు, రాకపోవచ్చని, పదవులు తనకు ముఖ్యం కాదనీ వివరించారు.

మాస్ లీడర్..

మాస్ లీడర్..

వైఎస్ జగన్ ఓ గొప్ప మాస్ లీడర్ అని శిల్పా చక్రపాణిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ప్రజల్లోకి వస్తే ఎవ్వరూ తట్టుకోలేరని అన్నారు. లక్షలాదిమందిని కదిలించగల సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పారు. బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్నందున.. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఆయన అహర్నిశలు శ్రమిస్తోన్నారని, తీరిక లేకుండా గడుపుతున్నారని అన్నారు. ఒక్కసారి ఆయన పూర్తిస్థాయిలో ప్రజల్లోకి రావడం అంటూ జరిగితే ఆ ప్రభంజనాన్ని ఎవరూ తట్టుకోలేరని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+