నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లో ఆనందయ్య ఆయుర్వేద మందు..

|
Google Oneindia TeluguNews

ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కంట్లో వేసే చుక్కల మందు తప్ప.. మిగతా వాటికి పర్మిషన్ ఇచ్చింది. అయితే మరో గూడ్ న్యూస్ తెలిపింది ప్రభుత్వం. ఆనందయ్య ఆయుర్వేద మందును ఆన్‌లైన్‌లో అందజేస్తామని తీపికబురు అందజేసింది. దీంతో సుదూర ప్రాంతాల్లో గల రోగులకు మేలు జరగనుంది.

అంతకుముందు ఆనందయ్యతో నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు సమావేశం అయ్యారు. ఆయుర్వేద మందు గురించి వారిద్దరి మధ్య చర్చ జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చక్రధర్‌బాబు వివరించారు. కరోనా పాజిటివ్ రోగులకిచ్చే మందు పంపిణీకి మొదట ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

anandaiah medicine distribution starts soon in online

దీంతోపాటు త్వరలో ఆన్‌లైన్ ద్వారా ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. దీంతో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి మంచి జరగనుంది. రోగి/ వారి బంధువులు నెల్లూరు వచ్చి మందు తీసుకొనిపోవడం కన్నా.. ఆన్ లైన్ డెలివరీ వల్ల మేలు జరగనుంది. ఆయుర్వే మందు తయారీకి కొన్ని రోజులు సమయం పడుతుందని..‌. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మందు కోసం ఎవరూ రావొద్దని చక్రధర్‌బాబు విజ్ఞప్తి చేశారు.

కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఆ క్రమంలోనే కలెక్టర్ చక్రధర్ బాబు కూడా రిక్వెస్ట్ చేశారు. ఆయన వినతి మేరకు జనం కూడా నెల్లూరు వెళ్లి ఇబ్బందులు పడొద్దు. ఒకవేళ వెళితే అధికారులు నిలిపివేసే అవకాశం ఉంది.

English summary
anandaiah medicine distribution starts soon in online nellore collector chakradhar babu said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X