Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో గగన విజయానికి ఇస్రో సమాయాత్తం: విప్లవాత్మక ప్రయోగానికి తయార్: స్పెషాలిటీస్ ఇవే..

నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. మరో గగన విజయానికి సమాయాత్తమౌతోంది. వరుస విజయాలతో నింగిపై ఆధిపత్యాన్ని సాధించిన దేశాల సరసన సగర్వంగా నిలిచిన భారత్..ఆ దిశగా మరో విప్లవాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సిరీస్‌లో మరో మిషన్‌ను చేపట్టింది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ఆరంభమైంది. ఈ తెల్లవారు జామున 3:43 నిమిషాలకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది ఇస్రో.

Recommended Video

    ISRO : #GSLVF10 EOS-03 విపత్తులను ముందే పసిగట్టేలా Satellite Launch || Oneindia Telugu

    గురువారం తెల్లవారు జామున..

    గురువారం తెల్లవారు జామున..

    నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌10 నింగిలోకి దూసుకెళ్లబోతోంది. సాధారణంగా- రాకెట్ లాంచింగ్ సమయానికి సరిగ్గా 26 గంటల ముందు కౌంట్‌డౌన్ చేపడుతుంటుంది ఇస్రో. ఇందేులో భాగంగా జీఎస్‌ఎల్వీ-ఎఫ్10/ఈఓఎస్-03 రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపించనుంది. జీఎస్‌ఎల్వీ-ఎఫ్10 ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఇది 79వ ప్రయోగం.

    కరోనా వల్ల బ్రేక్ పడినా..

    కరోనా వల్ల బ్రేక్ పడినా..

    కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోండటం, లాక్‌డౌన్ తరహా పరిస్థితుల వల్ల ఇస్రో లాంచింగ్ ప్రాజెక్టుల్లో కొంత జాప్యం ఏర్పడుతూ వచ్చింది. కరోనా ప్రభావం వల్ల శ్రీహరికోటలో రాకెట్ల ప్రయోగాలు స్తంభించిపోయాయి. సుదీర్ఘ విరామం తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి మిషన్‌ను చేపట్టింది. దాన్ని విజయవంతం చేసింది. పీఎస్‌ఎల్వీ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ఏడాది కూడా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత వల్ల చేపట్టదలిచిన ప్రయోగాల్లో కూడా జాప్యం నెలకొంది.

    కౌంట్ డౌన్..

    కౌంట్ డౌన్..

    పరిస్థితులు అనుకూలించడంతో జీఎస్‌ఎల్వీ-ఎఫ్10/ఈఓఎస్-03 రాకెట్‌ను మిషన్‌ను టేకప్ చేసింది. దాన్ని పూర్తి చేసింది. గురువారం తెల్లవారు జామున 5:43 నిమిషాలకు దాన్ని అంతరిక్షంలోకి పంపించబోతోంది. దీన్ని విజయవంతం చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తోన్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధా కేంద్రంలోని సెకెండ్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ జీఎస్‌ఎల్వీ-ఎఫ్10/ఈఓఎస్-03 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ఆరంభించింది.

     పేలోడ్స్ ఏంటీ?

    పేలోడ్స్ ఏంటీ?

    జీఎస్‌ఎల్వీ-ఎఫ్10/ఈఓఎస్-03 రాకెట్‌ ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈవోఎస్‌-03)ను నింగిలోకి పంపించనుంది. ఇందులో- ఆరు బ్యాండ్స్‌తో కూడిన మల్టీస్పెక్ట్రల్‌ విజబుల్‌ అండ్‌ నియర్‌ ఇన్‌ఫ్రారెడ్‌, హైపర్‌స్పెక్ట్రల్‌ విజబుల్‌ అండ్‌ నియర్‌ ఇన్‌ఫ్రారెడ్‌, హైపర్‌ స్పెక్ట్రల్‌ షార్ట్‌ వేవ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ పేలోడ్స్‌గా అమర్చారు. ఈ శాటిలైట్‌ను భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తున ఉన్న జియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనుంది ఇస్రో. 506 నుంచి 830 కిలో మీటర్లు ఎత్తులో ఉన్న సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌‌లోకి మాత్రమే ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటి దాకా రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్స్‌‌ను ప్రవేశపెడుతూ వచ్చారు.

    ప్రయోగాల్లో ముందడుగు..

    ప్రయోగాల్లో ముందడుగు..

    దీనికి భిన్నంగా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ -03 ద్వారా రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ను మొట్టమొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో చేపట్టిన 70వ ప్రయోగం ఇది. అలాగే- జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాల సిరీస్‌లో ఇది 14వది. సొంత సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన క్రయోజనిక్‌ టెక్నాలజీలో ఇది 8వది. ఈ ఉపగ్రహం ద్వారా భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తు నుంచి అత్యంత శక్తిమంతమైన కెమెరాల ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్‌ను చేపడుతుంది ఇస్రో.

     విపత్తులను ముందే పసిగట్టేలా..

    విపత్తులను ముందే పసిగట్టేలా..

    50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలను తీసి పంపిస్తుంది. సుమారు ఈ శాటిలైట్ జీవిత కాలం సుమారు 10 సంవత్సరాలుగా నిర్ధారించారు. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థ, ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టడం, వాటికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈవోఎస్‌-03 రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+