ఇది కలికాలమే: భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నావ్యక్తిని.. ఐదుగురితో గ్యాంగ్ రేప్ చేయించాడా...?
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ యువకుడిపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ దురాగతాన్ని వీడియో తీసిన నిందితులు విషయం ఎవరికైనా చెబితే దాన్ని బయటపెడతామని, చంపేస్తామని బెదిరించారు. షాక్ నుంచి తేరుకున్న యువకుడు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం ఉచ్చూరుకి చెందిన ఓ యువకుడు బుధవారం సూళ్లురుపేట యమహా షోరూం వద్ద స్నేహితుల కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన నాగరాజపురానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అతనితో మాటలు కలిపారు. ఆ తర్వాత అతన్ని కిడ్నాప్ చేసి ఆటోలో ఎక్కించారు. మన్నారు పోలూరు శివారులోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి కర్రలతో దాడి చేశారు. అనంతరం ఐదుగురు నిందితులు యువకునిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

యువకుడిపై సామూహిక అత్యాచారానికి సంబంధించిన దృశ్యాలను నిందితులు సెల్ ఫోన్‌లో షూట్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతామని, చంపేస్తామని బెదిరించారు. దీంతో తొలుత భయపడిన యువకుడు ఆ తర్వాత షాక్ నుంచి తేరుకుని సూళ్లురుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితులను నాగరాజపురానికి చెందిన దయాకర్, బాల చెన్నయ్య, వెంకటేశ్వర్లు, మహేష్, మస్తాన్‌గా గుర్తించారు. నిందితుల్లో ఒకరి భార్యతో బాధితుడికి అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానించి ప్రతీకారంగా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications