నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ నెల్లూరు కోటకు బీటలు: మరో బిగ్ వికెట్ అవుట్: కోటంరెడ్డికి ఫుల్ సపోర్ట్..!!

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు రూరల్ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఒకటి- ఉమ్మడి నెల్లూరు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. అన్ని నియోజకవర్గాల్లోనూ పాగా వేసింది. వరుసగా రెండోసారీ సునామీ సృష్టించిందక్కడ. 2014లో తెలుగుదేశం-బీజేపీ ప్రభంజనాన్ని తట్టుకుని కూడా వైసీపీకి పట్టం కట్టారు ఈ జిల్లా ప్రజలు. అలాంటి చోట వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి, అసమ్మతి గళం వినిపిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆనంతో మొదలు..

ఆనంతో మొదలు..

మొన్నటికి మొన్న సీనియర్ నాయకుడు, తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి.. అధికార పార్టీపై తిరుగుబాటు బావుటా లేవదీశారు. సొంత పార్టీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. బహిరంగంగానే. ప్రభుత్వ పెద్దలను విమర్శించారు. అధికార యంత్రాంగాన్నీ తప్పుపట్టారు. మంత్రి పదవి లభించకపోవడం వల్లే ఆయన పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పారనే విషయం బహిరంగ రహస్యమే.

కోటంరెడ్డితో..

కోటంరెడ్డితో..

ఇప్పుడు అదే బాటలో నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నడుస్తోన్నారు. పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తనను అనుమానించిన, అవమానించిన పార్టీలో ఒక ఉండకూడదని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయట్లేదని తేల్చి చెప్పారు. అందుకే బహిరంగంగా తాను మాట్లాడాల్సి వచ్చిందని వివరించారు. తన ఫోన్ ను ట్యాప్ చేస్తోన్నారంటూ ఆయన సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు.

తాజాగా మరో వికెట్..

తాజాగా మరో వికెట్..

ఇక తాజాగా నెల్లూరు వైసీపీలో మరో బిగ్ వికెట్ పడింది. నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆమె తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తాను కోటంరెడ్డి వెంటే ఉంటానని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తన పదవి పోయినా పట్టించుకోననీ స్పష్టం చేశారు. కోటంరెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టారని, అందుకే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తానని అన్నారు.

అన్నీ ఆలోచించే..

అన్నీ ఆలోచించే..

ఇవ్వాళ ఆమె నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. కోటంరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అన్నీ ఆలోచించిన తరువాతే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని పొట్లూరి స్రవంతి అన్నారు. కోటంరెడ్డి చెబితే ఇప్పటికిప్పుడు తన మేయర్ పదవికి రాజీనామా చేయడానికీ సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. పార్టీలో కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడు కోటంరెడ్డి ఒక్కరేనని తేల్చి చెప్పారు.

మొదటి నుంచీ అనుచరుడిగా..

మొదటి నుంచీ అనుచరుడిగా..

తన భర్త జయవర్ధన్ కు కోటంరెడ్డి ఎన్నోసార్లు అండగా నిలిచారని, అటు కార్పొరేటర్ గా తాను గెలవడానికీ ఎంతో కృషి చేశారని స్రవంతి అన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, తాను, తన భర్త కోటంరెడ్డి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. బహిరంగంగానే తాను కోటంరెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నానని, ఇందులో ఎలాంటి లోపాయకారి ఒప్పందాలు లేవని చెప్పారు. తమ వెంట మరి కొంతమంది నాయకులు వస్తారని ఆశిస్తున్నట్లు స్రవంతి పేర్కొన్నారు.

వస్తుంటాయి..పోతుంటాయి- ఇందులో కొత్తేముంది?: అదాని వ్యవహారంపై నిర్మల సీతారామన్వస్తుంటాయి..పోతుంటాయి- ఇందులో కొత్తేముంది?: అదాని వ్యవహారంపై నిర్మల సీతారామన్

English summary
Nellore Mayor Potluri Sravanthi announced support to YSRCP's rebel MLA Kotamreddy Sridhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X