బాలికను నగ్న చిత్రాలు పంపించాలని వేధిస్తున్న యువకుడు .. తిక్క కుదిర్చిన పోలీసులు

మిస్డ్ కాల్ తో పరిచయమయ్యాడు.. ప్రేమా దోమా అంటూ ఓ బాలికను ట్రాప్ లోకి దించాడు. రోజూ గంటల తరబడి సెల్ ఫోన్ లో మాట్లాడాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. ఇంకేంటి ఇవన్నీ చెప్పి బాలికను నగ్న చిత్రాలు పంపించాలంటూ వేధించసాగాడు. ఒకవేళ చెప్పింది వినకుంటే ఇంతకుముందు పంపిన అర్ధనగ్న చిత్రాలను మీడియా లో పెడతాను అంటూ బెదిరించాడు. దిక్కుతోచని స్థితిలో బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

మిస్డ్ కాల్ తో బాలికను ట్రాప్ లోకి దించిన యువకుడు .. అర్ధ నగ్న చిత్రాలు పంపే దాకా సాగిన సంభాషణ

మిస్డ్ కాల్ తో బాలికను ట్రాప్ లోకి దించిన యువకుడు .. అర్ధ నగ్న చిత్రాలు పంపే దాకా సాగిన సంభాషణ

నెల్లూరు జిల్లాకు చెందిన బి శ్రీనివాసరావు విశాఖపట్నం గోపాలపట్నం లోని ఓ బాలిక కుటుంబసభ్యుల సెల్ ఫోన్ కు మిస్డ్ కాల్ ఇచ్చాడు. ఇక ఆ నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడిన బాలికతో పరిచయం పెంచుకున్న శ్రీనివాసరావు మూడు నెలలపాటు బాలికతో రోజు గంటల తరబడి సంభాషణలు సాగించాడు. ఈ క్రమంలోనే బాలిక అర్ధ నగ్న చిత్రాన్ని తనకు పంపించాలని కోరాడు. మొదట నిరాకరించిన ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మభ్య పెట్టటంతో అతని మాటలు నమ్మి అతను కోరిన విధంగా అర్ధనగ్న చిత్రాలను అతనికి పంపించింది. ఇక వాటిని అడ్డంపెట్టుకొని బాలికను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడు సదరు ప్రబుద్ధుడు.

నగ్న చిత్రాలు పంపాలని వేధింపులు .. పోలీసులను ఆశ్రయించిన బాలిక

నగ్న చిత్రాలు పంపాలని వేధింపులు .. పోలీసులను ఆశ్రయించిన బాలిక

ఇక తాజాగా పూర్తిగా నగ్నంగా ఉన్న చిత్రాలను పంపించాలని, అలా పంపించ కుంటే అంతకుముందు బాలిక పంపించిన ఫోటోలు అన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బాలికను బెదిరించసాగాడు శ్రీనివాస రావు. దీంతో భయపడిన బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయం మొత్తాన్ని వివరించింది. పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు అతనిపై కేసు పెట్టారు. పోలీసులు దర్యాప్తు చేసి అతని సెల్ ఫోన్ టవర్ ఆధారంగా శ్రీనివాస రావు అడ్రస్ తెలుసుకుని అతనిని అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న బాలిక ఫోటోలను డిలీట్ చేయడంతో పాటుగా, అతడిని రిమాండ్ కు పంపించారు పోలీసులు.

అపరిచితులతో తస్మాత్ జాగ్రత్త .. నమ్మి మోసపోకండి

అపరిచితులతో తస్మాత్ జాగ్రత్త .. నమ్మి మోసపోకండి

ఈ తరహా ఘటనలు ప్రస్తుతం నిత్యకృత్యంగా మారిపోయాయి.తెలిసీ తెలియని వయసులో వున్న బాలికలను ట్రాప్ చేసి వారిని ఈ తరహా వేధింపులకు గురిచేయడం సర్వసాధారణంగా మారిపోయింది. అందుకే ముఖ్యంగా బాలికలు అపరిచితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫేస్బుక్ ,వాట్సాప్ లలో ఫోటోలు షేర్ చేయడం వంటి పనులు చేయకూడదు. పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్తే నమ్మి మోసపోవద్దు. ఇక బాలికలు ఏం చేస్తున్నారు అన్న దానిపై తల్లిదండ్రులు కూడా దృష్టి పెట్టాలి. లేకుంటే మీ బాలికల భవిష్యత్తు ఇటువంటి ఘటనలతో ఇబ్బందుల పాలయ్యే ప్రమాదం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+