స్టార్ట్ అవడం లేదని మెకానిక్ వద్దకు తీసుకెళ్తే.. బైక్‌లో భారీ పాము దర్శనం!

నిజామాబాద్: వర్షాకాలం పాములు బెడద ఎక్కువగానే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి. తాజాగా, ఓ భారీ పాము నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం ఆర్గుల్‌లో కలకలం సృష్టించింది. ఓ రైతు ద్విచక్ర వాహనంలో చొరబడిన పెద్ద నాగు పాము గంటపాటు అందరినీ భయాందోళనకు గురిచేసింది.

అర్గుల్‌కు చెందిన లింగన్న తన బైకు స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లాడు. బైక్‌లో నాగు పాము కనిపించడంతో మెకానిక్ తోపాటు అక్కడివారంతా భయాందోళనకు గురయ్యారు. ఇంజన్ సమస్య ఉందని భాగాలను విప్పుతుండగా ఇంజన్ లోపల చుట్టుకొని ఉన్న నాగుపాము దర్శనమివ్వడం కలకలం రేపింది.

 A big snake found in a bike in Nizamabad district.

పామును బయటకు తీయడానికి ప్రయత్నించిన వ్యక్తిని నాగుపాము ముప్పు తిప్పలు పెట్టింది. ఎట్టకేలకు దానిని బలవంతంగా బయటకు తీశారు. ఆ తర్వాత తమకెక్కడ హానీ చేస్తోందోనని స్ధానికులు ఆ పామును చంపేశారు. కాగా, పాములు వాహనాల్లోకి దూరిన ఘటనలో గతంలోనూ చోటు చేసుకున్నాయి. ఎక్కువగా ఈ ఘటనలు వర్షాకాలంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

వర్షాకాలంలో పాములు ఎక్కువగా బయట తిరుగుతుంటాయి. బైకులు, కార్లు వంటి వాహనాల క్రింద ఆశ్రయం పొందుతుంటాయి. కాబట్టి ప్రజలు వాటిని బయటకు తీసేముందు ఓసారి పరిశీలించుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఇంటి బయట విడిచిన షూలలో కూడా పాములు తలదాచుకున్న ఘటనలో గతంలో వెలుగుచూశాయి. దీంతో షూలు వేసుకునే ముందు వాటిని పరిశీలించి వేసుకోవాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+