తెలంగాణలో ఎంపీగా కవిత ఓడింది .. కానీ కవిత గెలిచింది .. టీఆర్ఎస్ కు కొంత రిలీఫ్
Recommended Video
తెలంగాణా రాష్ట్రంలో గులాబీ బాస్ కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. కానీ మాలోతు కవిత విజయం సాధించారు. కేసీఆర్ తనయ కవితకు నిజామాబాద్ ఓటర్లు షాక్ ఇచ్చారు. మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగిన మాలోతు కవితకు పట్టం కట్టారు. టీఆర్ఎస్ నుండి పోటీ చేసిన ఇద్దరు కవితల్లో ఒకరు ఆవేదనలో ఉంటె మరొకరు ఆనందంలో ఉన్నారు. ఒకరి ఓటమి టీఆర్ఎస్ నాయకుఅల్ను బాధించినా మరొకరి గెలుపు టీఆర్ఎస్ నాయకులకు కాస్త రిలీఫ్ నిచ్చింది .

కల్వకుంట్ల కవితను ఓడించిన నిజామాబాద్ ప్రజలు
కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను ఓటమి పాలు చేశారు నిజామాబాద్ ప్రజలు. గత ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవితకు పట్టం కట్టిన ప్రజలు ఈ సారి ఆమెను తిరస్కరించారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు పట్టం కట్టారు. కవిత పై ధర్మపురి అరవింద్ 69 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. నిజామాబాద్ ఎన్నికల్లో రైతులు పెద్ద సంఖ్యలో బరిలోకి దిగటం కవిత పరాజయానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. రైతులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు నిరసన కవిత ఓటమికి ప్రధాన కారణం అని తెలుస్తుంది.

మాలోతు కవితను గెలిపించిన మానుకోట ఓటర్లు
ఇక మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగిన మాలోతు కవిత కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన బలరాం నాయక్ పై విజయం సాధించారు . మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరుపున 1,46,562 మెజార్టీతో గెలిచిన మాలోతు కవిత గృహిణి స్థాయి నుంచి కలిసివచ్చిన రిజర్వేషన్‌లతో రాజకీయ నాయకురాలిగా ఎదిగారు. మరిపెడ మండలం ఉగ్గంపల్లిలో డోర్నకల్ శాసనసభ్యులు, మాజీ మంత్రి డీఎస్.రెడ్యానాయక్ కుమార్తె మాలోతు కవిత . మానుకోటలో విజయం సాధించటంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

ఒక కవిత ఎంపీగా ఓడినా మరో కవిత గెలిచింది
టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన కవితల్లో ఒకరు లోక్ సభలో అడుగు పెట్టబోతున్నారు. గతంలో లోక్ సభలో తెలంగాణా గళాన్ని వినిపించిన కల్వకుంట్ల కవిత స్థానంలో ఈసారి మాలోతు కవిత తన గళాన్ని వినిపించబోతున్నారు. మొత్తానికి ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక కవిత ఓటమి పాలైనా మరో కవిత విజయం టీఆర్ఎస్ పార్టీలో చర్చకు కారణం అవుతుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications