నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజామాబాద్‌కు అదే రోజు ఫిక్స్..! వాయిదా లేనట్లే..! "U" ఆకారంలో 12 ఈవీఎంలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ లోక్‌సభ ఎలక్షన్లకు రంగం సిద్ధం చేస్తోంది ఎన్నికల సంఘం. అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీపడుతుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అధికారులు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు. ఆ మేరకు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 బ్యాలెట్ యూనిట్లు పెట్టి.. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కల్వకుర్తిలో కల్వకుర్తిలో "గులాబీ నేతల లొల్లి"!.. ప్రచారంలో ఫైటింగ్.. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ

అర్ధరాత్రి వరకు చర్చలు

అర్ధరాత్రి వరకు చర్చలు

దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికల్లో 185 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. సిట్టింగ్ ఎంపీ కవితకు వ్యతిరేకంగా 178 మంది రైతులు బరిలో నిలిచారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికల నిర్వహణకు సమయం సరిపోదని భావించిన ఎన్నికల సంఘం అధికారులు.. MP-3 ఈవీఎంల వైపు మొగ్గు చూపారు.

ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు ఉమేశ్‌సిన్హా, ఈవీఎంల ఇన్‌ఛార్జి సుదీప్‌జైన్‌, నిఖిల్‌కుమార్‌ల బృందం.. హైదరాబాద్ లో రాష్ట్ర ఎన్నికల బాధ్యులు భేటీ అయ్యారు. నిజామబాద్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు అంశాలు చర్చించారు. సోమవారం అర్ధరాత్రి వరకు వీరి చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది.

3 టేబుళ్లు.. 12 బ్యాలెట్ యూనిట్లు

3 టేబుళ్లు.. 12 బ్యాలెట్ యూనిట్లు

యూ ఆకారంలో 3 టేబుళ్లపై మొత్తం 12 బ్యాలెట్‌ యూనిట్లు (EVM's) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. ఒక్కో టేబుల్ పై నాలుగు చొప్పున అమర్చనున్నట్లు తెలిపారు. 7 సెకన్లలో వ్యవధిలో ఓటర్లు వీవీ ప్యాట్‌ స్లిప్‌ను చూసుకోవచ్చని చెప్పారు.

నిజామాబాద్ పార్లమెంటరీ స్థానంలో పనిచేసే అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు.. మంగళవారం వారి పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయా పోలింగ్ కేంద్రాల్లో 12 బ్యాలెట్‌ యూనిట్లు పెట్టొచ్చా.. అక్కడి పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయి.. పోలింగ్‌ ఏజెంట్లు కూర్చోవడానికి తగిన ప్లేస్ ఉందా అనే విషయాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పరిశీలించి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

 ఇదే ఫస్ట్ టైమ్.. చరిత్రే..!

ఇదే ఫస్ట్ టైమ్.. చరిత్రే..!

నిజామాబాద్ ఎంపీ ఎన్నికల సందర్భంగా.. పోలింగ్ పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిని నియమించాలని నిర్ణయించారు ఈసీ అధికారులు. ఎక్కువమంది అభ్యర్థులున్న చోట ఈవీఎంలతో పోలింగ్ జరపడం కూడా ఇదే మొదటిసారి అవుతుందన్నారు.
అయితే ఇదివరకు గరిష్టంగా 4 బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించినట్లు తెలిపారు ఉమేష్‌సిన్హా.

తొలిసారిగా నిజామాబాద్‌లో 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట్లు చెప్పారు. అయితే ఎన్నికల నిర్వహణకు 25 వేల బ్యాలెట్ యూనిట్లు, 2 వేల కంట్రోల్ యూనిట్లు అవసరమవుతాయని తెలిపారు. ఆ మేరకు బుధవారం రాత్రి వరకు ఈవీఎంలు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. అవి రాగానే వాటి పనితీరు పరిశీలించడం మొదలవుతుందని అన్నారు.

హార్దిక్ పటేల్‌కు బిగ్ షాక్..! సుప్రీం తీర్పుతో ఎంపీ బరిలో లేనట్లే?హార్దిక్ పటేల్‌కు బిగ్ షాక్..! సుప్రీం తీర్పుతో ఎంపీ బరిలో లేనట్లే?

 16కు 400.. ఒక్కదానికి 600

16కు 400.. ఒక్కదానికి 600

నిజామాబాద్ బరిలో ఈవీఎంల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించడానికి 600 మంది ఇంజినీర్లు అవసరమనేది అధికారుల అంచనా. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా 16 నియోజకవర్గాల్లో 400 మంది ఇంజినీర్లు అవసరముంటే.. నిజామాబాద్ లో ఒక్కచోటే 600 మంది సేవలందిస్తారని తెలిపారు.

వాయిదా వద్దు.. ఎన్నికలు జరపండి

వాయిదా వద్దు.. ఎన్నికలు జరపండి

నిజామాబాద్ ఎన్నికలను ఎట్టిపరిస్థితుల్లో వాయిదా వేయొద్దని.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కోరారు కాంగ్రెస సీనియర్ లీడర్లు మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్. పనిలోపనిగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేశారు. సీఎం కేసీఆర్ రైతుతో మాట్లాడి భూమి సమస్య పరిష్కరించిన అంశం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని కంప్లైంట్ ఇచ్చారు. అదలావుంటే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు కొన్నిప్రాంతాల్లో గుడ్డలు కట్టిన విషయం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దానిపై స్పందించిన ఈసీ అధికారులు సీరియస్ గా పరిగణిస్తామని తమకు చెప్పినట్లు వెల్లడించారు.

English summary
The Election Commission is preparing for the Nizamabad Lok Sabha elections. Most of the 185 candidates were contesting from here. The schedule is underway to hold elections. EC officials plans to set up 12 ballot units in each polling station. The polls are being planned smoothly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X