పోటెత్తిన వరద: నిజాం సాగర్, శ్రీరాం సాగర్‌లోకి వరద ప్రవాహం

వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ వరద ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. నీటితో ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. ఇప్పటికీ వరద ప్రవాహం కొనసాగుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కంటిన్యూ అవుతోంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌ ఇన్‎ఫ్లో 10,590 క్యూసెక్కులు కాగా, ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు.. ప్రస్తుతం 1,398 అడుగులుగా ఉంది. నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 17.802 టీఎంసీలు గాను, ప్రస్తుతం 9.485 టీఎంసీలుగా ఉంది.

ఇటు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‎కు వరద పోటెత్తుతుంది. అప్రమత్తమైన అధికారులు 30 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‎ఫ్లో 1,75,000 క్యూసెక్కులు కాగా.. ఔట్‎ఫ్లో 1,70,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1,089 అడుగులు ఉంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 90 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 80.139 టీఎంసీలు ఉంది.

water flow continue in nizam sagar, sriram sagar

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మరో రోజు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలతో ఇప్పటికే వాగులు, కుంటలు, చెరువులు నిండిపోయాయి. ఎగువన కురుస్తోన్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వర్షపునీరు భారీగా చేరుతుంది. ప్రాజెక్టుల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+