పోలీస్ స్టేషన్ లో యువకుడి వీరంగం .. ఎస్సైని, కానిస్టేబుల్ ని దుర్భాషలాడి రచ్చ
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. గంట పాటు నానా హంగామా చేశాడు. ఓ యువకునిపై దాడి చేసిన కేసులో పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చినందుకు పోలీసులనే నానా దుర్భాషలాడాడు. చంపుతా అని బెదిరించారు . మాజీ సర్పంచ్ కొడుకుని నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తారా అంటూ ఎస్.ఐ. పైనే వీరంగం వేశాడు .
ఒక ఘర్షణ విషయంలో పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన ఎడపల్లి మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు కుమారుడు రాజీవ్ నాయుడు అలియాస్ చంటి ఓ కానిస్టేబుల్ ను చంపుతానని బెదిరించడంతో పాటు ఎస్.ఐ. రూంలో కుర్చీలను నెంబర్ ప్లేట్ ధ్వంసం చేశాడు. పోలీసులు సదరు యువకునికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా తాగిన మత్తులో పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. నానా హంగామా సృష్టించాడు .ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న రాజీవ్ నాయుడు గ్రామానికి చెందిన కట్కం శంకర్ అనే వ్యక్తితో గొడవ పడి బీరు సీసాతో దాడి చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజీవ్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించగా కానిస్టేబుల్ ను చంపుతానంటూ బెదిరించిన రాజీవ్.. ఎస్.ఐ. ఎల్లాగౌడ్ తోను అమర్యాదగా ప్రవర్తించాడు. తనపై చేసి వేస్తే సంగతి చూస్తా నంటూ బెదిరించాడు. స్టేషన్ లో నువ్వన్నా ఉండాలి , నేనైనా ఉండాలంటూ నానా హంగామా సృష్టించాడు. తాగిన మత్తులో వీరంగం సృష్టించిన రాజీవ్ తో విసిగిపోయిన పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరీక్షల నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాజీవ్ పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు .
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications