Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీలో భూకంపం: వైసీపీలోకి మాజీమంత్రి శిద్ధా రాఘవరావు కూడా సిద్ధమా?: మంత్రి బాలినేనితో టచ్‌లో.. !

ఒంగోలు: స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కకావికలమౌతోంది. వరుసగా వలసల బెడదను ఎదుర్కొంటోంది. గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో ఆరంభమైన ఈ వలసల పరంపరకు ఇప్పట్లో బ్రేకులు పడేలా కనిపించట్లేదు. ఆవిర్బావం నుంచీ పార్టీలో కొనసాగుతూ వస్తోన్న మాజీమంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి, తాజాగా మాజీ ఎమ్మెల్యే యామినీ బాల, ఆమె తల్లి, మాజీ ఎమ్మెల్సీ శమంతక మణి వంటి నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకొంటున్నారు.

శిద్ధా కూడా సిద్ధంగా..

శిద్ధా కూడా సిద్ధంగా..

తాజాగా- తెలుగుదేశం పార్టీకే చెందిన మరో సీనియర్ నాయకుడు, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు కూడా పార్టీ ఫిరాయించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఒంగోలు లోక్‌సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డితో మంతనాలు సాగిస్తున్నారనే వార్తలు ప్రకాశం జిల్లాలో వెల్లువెత్తుతున్నాయి. అదే జరిగితే- మరి కొన్ని రోజుల్లో శిద్ధా రాఘవరావు తెలుగుదేశాన్ని వీడటం, వైఎస్ఆర్సీపీ తీర్థాన్ని పుచ్చుకోవడం ఖాయమని చెబుతున్నారు.

ప్రకాశం జిల్లా టీడీపీలో ప్రకంపనలు..

ప్రకాశం జిల్లా టీడీపీలో ప్రకంపనలు..

శిద్ధా రాఘవరావు గుడ్‌బై చెప్పబోతున్నారంటూ వస్తోన్న వార్తలు ప్రకాశం జిల్లా టీడీపీలో కలకలం పుట్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన కదిరి బాబురావు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ మరుసటి రోజే జిల్లాకే చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్, మాజీమంత్రి పాలేటి రామారావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకొన్నారు. పార్టీ ఆవిర్బావం నుంచీ ఉంటోన్న కరణం బలరాం సైతం ముఖ్యమంత్రిని కలిశారు.

మరో రోజు గడిచేసరికి..

మరో రోజు గడిచేసరికి..


కరణం వెంకటేష్ వైసీపీలో చేరిన ఒక్కరోజు వ్యవధిలో.. శిద్ధా రాఘవరావు పేరు వినిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగుదేశంలో కొనసాగితే.. రాజకీయ భవిష్యత్తు ఉండకపోవచ్చనే ఉద్దేశంతో ఆయన పార్టీ ఫిరాయించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. తన కుమారుడ శిద్ధా సుధీర్ కుమార్‌తో కలిసి వైసీపీలో చేరవచ్చని తెలుస్తోంది. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే శిద్ధా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Recommended Video

    Modi Govt Assures Andhra Pradesh Of Special Funds| Oneindia Telugu
     తండ్రీ, కుమారుల ఓటమి..

    తండ్రీ, కుమారుల ఓటమి..

    గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్ కుమార్ ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి రాఘవరావు, కనిగిరి అసెంబ్లీ సీటు నుంచి సుధీర్ కుమార్ పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడం కరణం బలరా వంటి నాయకుడే పార్టీని ఫిరాయించాల్సిన పరిస్థితి ఎదురు కావడంతో.. శిద్ధా రాఘవరావు కూడా ఆయన బాటలోనే నడవాలని, కుమారుడితో కలిసి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం వారిద్దరూ మంత్రి బాలినేని, ఎంపీ మాగంటతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+