పవన్ కు షాకిచ్చి జనసేనను వీడనున్న మరోనేత .. తిరిగి సొంతగూటికి చేరే ఛాన్స్
ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుంది అని అందరూ భావించిన పార్టీ ఎలాంటి ప్రభావం చూపించకపోవటంతో ఇప్పుడు దాని ప్రభావం పార్టీపై పడుతుంది. ఓటమిపై సమీక్షలు చేసినా అందరూ ధైర్యంగా ముందుకు వెళ్లాలని దిశా నిర్దేశం చేసినా సరే జనసేన పార్టీ నుండి ఒక్కొక్కరు పార్టీ వీడి వెళ్తున్నారు. జనసేన ఏపీలో శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితం కావటం ఏకంగా పవన్ ఓటమి చెందటం ఇంకా అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు . ఇక ఈ సమయంలో మొన్న రావెల కిషోర్ బాబు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరితే తాజాగా మరో నేత పవన్ కు షాక్ ఇచ్చి పార్టీ వీడి వెళ్లనున్నారు .

పార్టీకి షాక్ ఇచ్చి జంప్ అవుతున్న జనసేన నేతలు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ .. రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పులు తీసుకు రావాలని తాపత్రయపడ్డారు కానీ అది సాధ్య పడలేదు. మార్పు కోరుకున్న పవన్ పార్టీ ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. దీంతో పార్టీలో ఎన్నికలకు ముందు చేరిన నేతలు పార్టీ కి గుడ్ బై చెప్తున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేతలు పార్టీకి రాజీనామా చేసి పక్క పార్టీల్లోకి జంప్ అవ్వటం గట్టి దెబ్బగా మారింది .

పవన్ కు షాక్ ఇవ్వనున్న ఆకుల సత్యన్నారాయణ .. బీజేపీలోకి జంప్ అయ్యే యోచన
ఓటమిపై నేతలు అధైర్యపడవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు సూచించినా ఫలితం లేకుండా పోతుంది .తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ జనసేను వీడనున్నారు. తిరిగి ఆయన తన సొంతగూటికి చేరుకోనున్నారు. ఎన్నికల ముందు పార్టీ ఫిరాయించిన ఆకుల సత్యన్నారాయణ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి లోకసభ స్థానం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇక దీంతో ఆయన సొంత గూటికే వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేనకు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు ఆకుల సత్యన్నారాయణ సిద్ధం అవుతున్నారు .

పార్టీని బలోపేతం చెయ్యాలని పవన్ ఆలోచన .. పార్టీని వీడి వెళ్తున్న నేతలతో ఇబ్బంది
ఒకపక్క పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చెయ్యాలని, పునర్నిర్మించాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ . పార్టీని బూత్ స్థాయి కమిటీలు వేసి, గ్రామ కమిటీలు వేసి పటిష్టం చెయ్యాలని నిర్ణయించారు . అలాగే జిల్లా స్థాయి సమీక్షలు జరిపిన ఆయన పార్టీని కొత్త పంధాలో మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ . కానీ అనూహ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ నుండి ముఖ్య నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పటం పవన్ కు , అలాగే జనసైనికులకు ఇబ్బందికరంగా మారింది .
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications