నారా లోకేష్ స్థానంలో భార్య బ్రాహ్మణి..!!

కాకినాడ: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

Nara Brahmani given key directions to the Jana Sena leaders

చంద్రబాబు అరెస్ట్ అంశం.. కొత్త పొత్తులకు తెర తీసింది. టీడీపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. 2024లో జరిగే స్వార్వత్రిక ఎన్నికల్లో తాము ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. త్వరలోనే ఈ రెండు పార్టీల నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటుపై ప్రస్తుతం కసరత్తు సాగుతోంది.

ఈ పరిణామాల మధ్య జనసేన పార్టీ నేతలు.. చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజమండ్రితో ఈ సమావేశం ఏర్పాటైంది. ప్రస్తుతం చంద్రబాబు కుటుంబం రాజమండ్రిలో తాత్కాలికంగా నివాసం ఉంటోంది. ప్రస్తుతం బ్రాహ్మణి అక్కడే నివసిస్తోన్నారు.

ఈ మధ్యాహ్నం జనసేన తూర్పు గోదావరి జిల్లా నేతలు ఆమెను కలిశారు. జనసేన నేత కందుల దుర్గేష్, టీడీపీ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సహా పలువురు నేతలు బ్రాహ్మణితో భేటీ అయ్యారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో- గోదావరి జిల్లాల్లో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిపై చర్చించారు.

ఈ సమావేశం ముగిసిన అనంతరం కందుల దుర్గేష్ విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం అక్రమం, అప్రజాస్వామికమని, రాష్ట్ర ప్రతిష్ఠ పూర్తిగా మసకబారిందని అన్నారు. పొత్తు నేపథ్యంలో టీడీపీ చేపట్టిన ఆందోళనలు, దీక్షలకు సంఘీభావం ప్రకటించామని చెప్పారు. టీడీపీకి బాసటగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వంపై చేపట్టిన ఉద్యమ వేగాన్ని పెంచుతామని, మున్ముందు మరింత తీవ్రతరం చేస్తామని దుర్గేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పారు. టీడీపీ- జనసేన సమన్వయ కమిటీలపై కసరత్తు సాగుతోందని, త్వరలోనే వివరాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+