రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలవరం రివర్స్ టెండరింగ్‌తో రూ.782 కోట్లు ఆదా.. ప్రాజెక్టు రూ.100 కోట్లు దాటితే జడ్జీ దృష్టికి...

|
Google Oneindia TeluguNews

పోలవరం రివర్స్ టెండరింగ్‌పై ఏపీ సీఎం జగన్ తొలిసారి స్పందించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 782 కోట్ల పైచిలుకు ఆదా చేయగలిగామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తాము చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పారదర్శక విధానాలు చేపడుతున్నామని వివరించారు జగన్. మరోవైపు పీపీఏలో కూడా విప్లవాత్మక విధానాలు తీసుకొస్తామని భరోసానిచ్చారు. దీంతో ఏపీ పారిశ్రామిక వర్గానికి మరింత బూస్ట్ ఇచ్చినట్లైందని పేర్కొన్నారు.

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో (ఎస్ఎల్బీసీ) ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిసారి పోలవరం రివర్స్ టెండరింగ్‌పై నోరు విప్పారు. పోలవరం రివర్స్ టెండరింగ్ అనేది రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు అని గుర్తుచేశారు. దీంతో దాదాపు రూ.782 కోట్లు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రజాధనాన్ని మరో ప్రజా ప్రయోజన పనులకు ఉపయోగిస్తామన్నారు. రాష్ట్రంలో చేపట్టే ప్రతి ప్రాజెక్టు రూ.100 కోట్ల దాటితే ఆ టెండర్‌ను జడ్జీ దృష్టికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు. పారదర్శకంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

polavaram reverse tendering save rs 782 crores

విద్యుత్ కొనుగోలు ఒప్పందం, పీపీఏలో విషయంలో కూడా పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. లేదంటే పారిశ్రామిక వర్గాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించబోరన్నారు. విద్యుత్ రంగం పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎస్ఎల్బీసీలో ప్రధానంగా రివర్స్ టెండరింగ్, నిధుల ఆదాపై చర్చ జరిగింది. ఆ నిధులను మిగతా విభాగాలకు ఎలా వ్యయం చేయాలనే అంశంపై సుదీర్ఘంగా డిస్కస్ చేశారు. ఏపీ విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.

English summary
polavaram reverse tender save 782 crores. that amount will be use another projects says ap cm ys jagan mohan reddy,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X