Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దుర్భాషలాడితే హీరోలా ..? రాష్ట్రం నీ అబ్బ జాగీరా నానీ ... టీడీపీ నేతల ఫైర్

వైసీపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీల బూతు పంచాంగం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపింది. టిడిపి నేతలు మాటల్లో చెప్ప రాకుండా వైసిపి నాయకులు మాట్లాడుతున్న పరుషపదజాలం పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఒకింత సహనం నశించిన కొందరు నాని, వంశీల భాషలోకి దిగుతున్నారు.

రాష్ట్రాన్ని ఏమైనా మీకు రాసిచ్చారా అంటూ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఆగ్రహం

రాష్ట్రాన్ని ఏమైనా మీకు రాసిచ్చారా అంటూ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఆగ్రహం

వైసిపి నాయకులు, మంత్రులు నోటికొచ్చినట్టు అనుచితంగా మాట్లాడుతున్నారని చాలా దిగజారి మాట్లాడుతున్నారని నెల్లూరు టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏమైనా నీ అబ్బ జాగీరా! నాని.. ఏంది నీ భాష.. 150 సీట్లు వస్తే.. రాష్ట్రాన్ని ఏమైనా మీకు రాసిచ్చారా? అంటూ నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ రవిచంద్ర . ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారా? అని మంత్రి కొడాలి నానిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విమర్శల వర్షం కురిపించారు.

 చంద్రబాబుపై పరుషంగా మాట్లాడిన కొడాలి నానీపై ఫైర్

చంద్రబాబుపై పరుషంగా మాట్లాడిన కొడాలి నానీపై ఫైర్

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం సందర్భంగా మాట్లాడిన బీద రవిచంద్ర మంత్రి కొడాలి నాని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో సభ్యత మరచి మాట్లాడుతున్న వైసిపి మంత్రుల తీరు కలిగిస్తోందన్నారు. మంత్రులు మాట్లాడుతున్న తీరు దారుణంగా ఉందని ఆక్షేపించారు. మా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాం, మాకు తోచినట్టే చేస్తాం అన్న రీతిలో వ్యవహరిస్తే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు.

వైసీపీ నేతలు దుర్భాషలాడినంతమాత్రాన హీరోలు అవుతారా .. డొక్కా ప్రశ్న

వైసీపీ నేతలు దుర్భాషలాడినంతమాత్రాన హీరోలు అవుతారా .. డొక్కా ప్రశ్న

రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పక్కదారి పట్టించడం కోసమే వల్లభనేని వంశీ, కొడాలి నానిని రంగంలోకి దించారని రవిచంద్ర ఆరోపించారు.ఇక టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సైతం వైసీపీ నేతలు మంత్రుల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మంత్రులు వైసీపీ నేతలు దుర్భాషలాడినంతమాత్రాన హీరోలు అవుతారా అంటూ ప్రశ్నించారు.

Recommended Video

    Vallabhaneni Vamsi & Kodali Nani Strategically Comparing Lokesh And Jr NTR || Oneindia Telugu
    నేతలు హుందాగా మాట్లాడకుంటే ప్రజలు గమనిస్తారన్న డొక్కా మాణిక్య వరప్రసాద్

    నేతలు హుందాగా మాట్లాడకుంటే ప్రజలు గమనిస్తారన్న డొక్కా మాణిక్య వరప్రసాద్

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వైసిపి మంత్రుల తాజా వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాజకీయ నాయకులు వచ్చినట్టు అసభ్య పదజాలం, పరుష పదజాలం వాడడం బాధాకరమన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. అన్నీ విషయాలు ప్రజలు గమనిస్తున్నారన్న డొక్కా నాయకులు హుందాగా వ్యవహరించాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఏదేమైనా నేతల విచక్షణ మరచి చేస్తున్న వ్యాఖ్యలు, వాడుతున్న పదాలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు దిగజారిపోతున్నాయన్న భావనను కలిగిస్తున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+