మరో రెండు మృతదేహాలు లభ్యం.. మొత్తం 38... మిగిలినవి 11

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. ఓవైపు బోటును వెలికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతుండగానే మరోవైపు మృతదేహాలు కొట్టుకువస్తున్నాయి. ఈనేపథ్యంలోనే గురువారం నాలుగు మృతదేహాలు దవళేశ్వరం బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చాయి. దీంతో బయటకు తీసిన అనంతరం వారిలో ఇద్దరు బోటు ప్రమాదంలో చనిపోయిన పవన్‌కుమార్ మరియు భవానిలుగా గుర్తించారు. వీరు ఇద్దరు కూడ హైదరాబాద్‌కు చెందిన వారు. మరోవైపు ధవళేశ్వం లభించిన మరో రెండు మృత దేహాల ఆచూకి కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 38 కి చేరింది.

సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 75 మంది ఉన్నాట్లు అధికారులు తెలిపారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 38 మృతదేహాలను బయటకు తీశారు. కాగా మరో 11 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్‌బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తుండగా రోజుకో శవం బయటపడుతోంది. మరోవైపు ప్రమాద స్థలంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడతో గాలింపు చర్యలకు బ్రేక్ పడుతోంది.

Two more boadies have been identified in Boat accident

ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే సహాయక చర్యలు చేపట్టిన , నేవీతో పాటు ఇతర సహాయక బృందాలు వెనక్కి వెళ్లాయి. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి తీసుకువచ్చే ప్రయత్నాలకు రహాదారి అడ్డుగా మారింది. దీంతో సాంప్రదాయ పద్దతిలో బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే...కాగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు ప్రమాదంలో ఇంకా పదకొండు మంది ఆచూకి కోసం సహయక బృందాలు గాలిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+