Rashmika Mandanna:ఫ్యాన్స్ అనేశారు.. శ్రీవల్లి సిగ్గుపడింది..లింకు కుదిరిందా..!

Rashmika Mandanna:టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఇక ఒకానొక సమయంలో విజయ్-నేషనల్ క్రష్ రష్మికా మందన్నాలు రిలేషన్‌లో ఉన్నారంటూ ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇద్దరూ కలిసి ఫారిన్ ట్రిప్‌లకు వెళ్లిన ఫోటోలు బయటకు రావడంతో ఇటు చర్చతో పాటు రచ్చ కూడా జరిగింది. తాజాగా రష్మిక మందన్నా ఓ ఈవెంట్‌కు అటెండ్ అయ్యింది. అక్కడ అభిమానులు కేకలు కేరింతలకు ఈ శ్రీవల్లి అందంగా సిగ్గుపడింది. ఇంతకీ ఆ కామెంట్స్ ఏంటి..? ఆ ఈవెంట్ ఏంటి..?

ఆనంద్ దేవరకొండ బ్రదర్ ఆఫ్ విజయ్ దేవరకొండ.. ఈ దేవరకొండ పేరు వింటేనే ఫ్యాన్స్‌కు పూనకం వస్తుంది. తాజాగా ఆనంద్ దేవరకొండ సినిమా బేబీ నుంచి ఓ సాంగ్ లాంచ్ అయ్యింది. ప్రేమిస్తున్నా అనే ఈ పాటను నేషనల్ క్రష్ రష్మికా మందన్నా లాంచ్ చేసింది. ఇంతవరకూ బాగానే ఉంది. వన్స్ రష్మికా మాట్లాడేందుకు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకోగానే ఆడిటోరియం దద్దరిల్లింది. ఫ్యాన్స్ కేకలు కేరింతలతో రష్మికా ముఖంలో సిగ్గు కనిపించింది.

 Rashmika Mandanna

రష్మికా మందన్నా అంతలా సిగ్గుపడటానికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం. శ్రీవల్లి మాట్లాడేందుకు మైక్ తీసుకోగానే దేవరకొండ ఫ్యాన్స్ వదినా వదినా అంటూ కేకలు వేశారు. విజయ్ దేవరకొండతో లింక్ పెట్టి ఫ్యాన్స్ వదినా అంటే కేకలు వేయడంతో మందన్నా కాసేపు మాటలకు బ్రేక్ వేసింది. ఫ్యాన్స్ ఏమంటున్నారో జాగ్రత్తగా విన్న తర్వాత ముఖంలో ఏదో తెలియని సిగ్గు కనిపించింది. కాస్త సిగ్గు పడుతూ నవ్వుతూ కనిపించింది రష్మికా.

 Rashmika Mandanna

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ రష్మికాలు నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం నుంచి నీ నీలి కన్నుల్లోన అనే పాటను రష్మికా మందన్నాకు అంకితం చేశాడు హీరో ఆనంద్ దేవరకొండ.రష్మికా కూడా ఈ పాటను పాడుతూ కనిపించింది. ఈ సీన్ అస్సలు మిస్ కాకూడదు అనేలా అనిపించింది. గీతగోవిందం చిత్రంలో విజయ్-రష్మికా మధ్య పండిన కెమిస్ట్రీతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక అప్పటి నుంచి విజయ్ దేవరకొండ - రష్మికలు ఒక్కటయితే బాగుంటుందన్న అభిప్రాయం కూడా ఫ్యాన్స్ వ్యక్తం చేశారు.

 Rashmika Mandanna

అప్పుడెప్పుడో విజయ్ దేవరకొండ - రష్మికాలు రిలేషన్‌లో ఉన్నారన్న వార్తలను ఖండించినప్పటికీ అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి హాలిడేస్‌కు ఫారిన్‌కు వెళ్లడం, రెస్టారెంట్స్‌లో కలిసి భోజనం చేస్తున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కడంతో వీరిద్దరి మధ్య అదేదో ఉందన్న గాసిప్స్‌కు బలం చేకూర్చాయి. ఇక ఆనంద్ దేవరకొండ బేబీ చిత్రం విషయంకొస్తే ఇందులో హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య నటిస్తోంది. జూలై 14న ఈ చిత్రం విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+