క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు: గుండెపోటుతో క్షణాల్లోనే మృతి

సిద్దిపేట: ఇటీవల కాలంలో గుండెపోటు, కార్డియాక్ అర్టెస్టుతో ఆకస్మికంగా మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో కార్డియాక్ అరెస్టుతో పలువురు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఓ యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కేఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్‌ జరుగుతోంది. ఈ క్రమంలో మైదానంలో బౌలింగ్ వేస్తున్న శనిగరం ఆంజనేయులు(37) అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు.

A youth dies with heart attack while playing cricket in Siddipet district.

యువకుడు కుప్పకూలిన వెంటనే అక్కడున్నవారు సీపీఆర్ చేసి.. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్ధరించారు. అప్పటి వరకు ఉత్సాహంగా తమతో క్రికెట్ ఆడిన ఆంజనేయులు.. ఆకస్మికంగా మరణించడంతో తోటి ఆటగాళ్లు, మిత్రులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలిసిన ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగరంలో కూడా ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు పరమేశ్ యాదవ్ అనే యువకుడు. గమనించిన తోటి ఆటగాళ్లు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరమేశ్ మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. అంతకుముందు ఫిబ్రవరి నెలలో విశాల్ అనే కానిస్టేబుల్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. వీరంతా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్‌తోనే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+