సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

48 గంటలు: రికవరీ కానీ సిద్దిపేట చోరీ నగదు, మరో రెండురోజుల్లో తేలేనా..

|
Google Oneindia TeluguNews

సిధ్దిపేటలో చోరీ పోలీసులకు సవాల్ విసిరింది. చోరీ జరిగి 48 గంటలు అవుతున్న ఇంకా నగదు రికవరీ చేయలేదు. సిద్దిపేట పోలీసు కమీషనర్ శ్వేత 24 గంటల్లో కేసును చేధిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు కేసులో ఎటువంటి పురోగతి కన్పించలేదు. సీసీకెమెరా ఫుటేజీ పరిశీలించినా.. నిందితుల జాడ మాత్రం తెలియలేదు. చోరీతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు.

విచారణ..

విచారణ..

కేసుకు సంబంధించి ఇప్పటికే ప్లాటు విక్రయదారు నర్సయ్య, కొనుగోలుదారు శ్రీధర్ రెడ్డి, డాక్యుమెంట్ రైటర్‌తోపాటు ప్రత్యక్ష సాక్షులను పోలీసులు పిలిపించి విచారించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. దుండగులను పట్టుకునేందుకు 15 పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు.

ఎలా ఫాలొ అయ్యారు..

ఎలా ఫాలొ అయ్యారు..

దుండగులు నర్సయ్య కారు డ్రైవర్‌ను ఎలా వెంబడించారు, ఎలా కాల్చారనే సీసీ పుటేజీని పోలీసులు విడుదల చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన సీసీ పుటేజీ దృశ్యాలు స్ధానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆగంతకులు అక్కడ రెక్కీ నిర్వహిస్తున్న క్రమంలో అతి సమీపంలో ఒక ద్విచక్ర వాహనదారుడు, ఒక కారు కాసేపు ఆగినట్టు సీసీ కెమెరాల్లో ఫుటేజీ కనిపించింది. నర్సయ్య, శ్రీధర్ రెడ్డి మధ్య క్రయవిక్రయానికి సంబంధించి డబ్బులు చేతులు మారే విషయాన్ని దుండగులకు చేరవేసింది ఎవరు..? ఈ మొత్తం చర్య వెనక అసలు కారకులు ఎవరన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా దాడి..

ఇలా దాడి..

ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఉండగా నర్సయ్య రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వచ్చారు. కారులో డ్రైవర్ కూర్చొని ఉండగా అద్దాలు పగలగొట్టి డబ్బులు ఎత్తుకుని వెళ్లినట్లు రియల్టర్ నర్సయ్య చెప్పారు. ఘటనా స్థలానికి సీపీ వచ్చారు. వెంటనే రంగంలోకి పోలీసులు దిగారు. ఆ ఇద్దరు పట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు. నగదను తీసుకెళ్లింది ఎవరూ... రిజిస్ట్రేషన్ అవుతుందని వారికేం తెలుసు అనే సందేహాలు కలుగుతున్నాయి. నర్సయ్య.. రియల్టరే గాక.. దొమ్మాట మాజీ సర్పంచ్‌గా పనిచేశారు. తన స్థలాన్ని విక్రయించాలని అనుకున్నాడు. సిద్దిపేటకు చెందిన టీచర్ శ్రీధర్ రెడ్డికి విక్రయించేందుకు అంగీకారం కూడా జరిగింది. భూమికి సంబంధించి 64.24 లక్షలు చెల్లించాలని ఇద్దరు మాట్లాడుకున్నారు. రిజిస్ట్రేషన్ కోసం సోమవారం కార్యాలయానికి వచ్చారు. ఈ సమయంలో శ్రీధర్ రెడ్డి నగదు కూడా ఇచ్చారు. ఆ మొత్తాన్ని కారు డ్రైవర్ పరశురామ్‌కు ఇచ్చి కారులో కూర్చొవాలని చెప్పి.. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్లారు.

English summary
police not traced siddipet theft huge money. two days before rs.43 lakhs are picked up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X