• search
  • Live TV
సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చీరల కోసం సిద్ధిపేటలో తొక్కిసలాట ..నగలు,నగదు చోరీ..మహిళల ప్రాణాలతో మాల్స్ చెలగాట

|

షాపింగ్ మాల్స్ మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయా ? 10రూపాయలకే చీర అంటూ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ మహిళల బలహీనతలతో ఆడుకుంటున్నాయా ? వాణిజ్య ప్రకటనలకు బదులుగా చీరలు ఇస్తామని పిలిచి పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాయా ? అంటే అవును అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో రోజుకో చోట నూతనంగా ప్రారంభిస్తున్న షాపింగ్ మాల్స్ లో 10 రూపాయలకే చీర ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటించడం వేలంవెర్రిగా మారిపోయింది.ఇప్పటికే పలుమార్లు పలు షాపింగ్ మాల్స్ లో తొక్కిసలాట జరిగినా మళ్లీ మళ్లీ అదే కొనసాగుతోంది.

10 రూపాయలకే చీర .. చీరల కోసం సిద్దిపేట షాపింగ్ మాల్ లో తొక్కిసలాట

10 రూపాయలకే చీర .. చీరల కోసం సిద్దిపేట షాపింగ్ మాల్ లో తొక్కిసలాట

సిద్దిపేటలో నూతనంగా ప్రారంభించిన సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో 10 రూపాయలకే చీర ఇస్తామంటూ ఆఫర్ ప్రకటించడంతో మహిళలు షాపింగ్ మాల్ కు ఎగబడ్డారు. చీరల కోసం జరిగిన తొక్కిసలాటలో గాయాలయ్యాయి. చీరల కోసం వంటి మీద ఉన్న బట్టలు చించుకున్నారు మహిళలు. ఏదైనా చిన్న వస్తువు ఫ్రీగా వస్తుందన్నా దాని కోసం ఎగబడటం ఒక సహజ నైజంగా మారిపోయింది . అలాంటిది 10 రూపాయలకే చీర ఇస్తామంటే భలే మంచి చౌక బేరము అంటూ షాపింగ్ మాల్ లో క్యూ కట్టారు మహిళలు. ఒక్కసారిగా ఊహించని విధంగా మహిళలు రావడం, వారు పోటీలు పడి ముందుకు దూసుకురావడంతో మాల్ నిర్వాహకులకు వారిని కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు. దీంతో తొక్కిసలాట జరిగింది. 20 మంది మహిళలు గాయాలపాలయ్యారు. ఉదయం నుండి షాపింగ్ మాల్ వద్ద క్యూ కట్టిన మహిళలు వెనకే ఉంటే చీరలు దొరుకుతాయో లేదో అన్న ఆలోచనతో ముందుకు దూసుకుపోయే ప్రయత్నం చేశారు. దీంతోనే తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది.

పది రూపాయల చీరకు ఆశ పడితే వేల రూపాయల నగలు చోరీ

పది రూపాయల చీరకు ఆశ పడితే వేల రూపాయల నగలు చోరీ

ఉదయంనుండి సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర భారీ సంఖ్యలో బారులు తీరిన మహిళలు పది రూపాయల చీర ఆఫర్ గంట పాటే ఉంటుంది అని చెప్పిన షాపింగ్ మాల్ సిబ్బంది ఒక్కసారిగా తలుపులు తెరవడంతో మహిళలు షాపింగ్ మాల్ లోకి దూసుకుపోయారు . దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. దాంతో పాటు జేబుదొంగలు వారి చేతికి పని చెప్పి, మహిళల మెడలో ఉన్న ఆభరణాలు దొంగిలించారు. 5 తులాల బంగారు ఆభరణాలను మాయం చేశారు. మహిళల మెడలో ఉన్న ఆభరణాలు, ఆరువేల రూపాయల నగదు , ఒక డెబిట్ కార్డ్ దొంగలు దోచేయడంతో లబోదిబోమంటూ ఆభరణాలు, నగదు పోగొట్టుకున్నవారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.పది రూపాయల చీర కోసం వచ్చి వేల రూపాయల బంగారాన్ని, నగదును పోగొట్టుకున్నారు.

పబ్లిసిటీ స్టంట్ చేస్తున్న షాపింగ్ మాల్ నిర్వాహకులు.. చోద్యం చూస్తున్న అధికారులు

పబ్లిసిటీ స్టంట్ చేస్తున్న షాపింగ్ మాల్ నిర్వాహకులు.. చోద్యం చూస్తున్న అధికారులు

పబ్లిసిటీ కోసం షాపింగ్ మాల్ యజమానులు ఈ తరహా స్టంట్ లతో మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గతంలో వరంగల్ లోనూ , కరీంనగర్ లోనూ , సిద్దిపేటలోనూ ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. తొక్కిసలాటలో మహిళలు గాయాలపాలయ్యారు. అయినప్పటికీ ఇటువంటి ఆఫర్లు పెట్టకుండా , మహిళలు ఇబ్బందులకు గురి కాకుండా చర్యలు తీసుకోవలసిన పోలీసులు, మునిసిపల్ కార్పొరేషన్ సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. షాపింగ్ మాల్ యాజమాన్యం తమ సేల్స్ పెంచుకునేందుకు, పబ్లిసిటీ కోసం జనాలను ఆకర్షించేందుకు అడ్డమైన ఆఫర్లు ప్రకటించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

వాణిజ్య ప్రకటనల కన్నా ఇలాంటి ఆఫర్లే మైలేజ్...

వాణిజ్య ప్రకటనల కన్నా ఇలాంటి ఆఫర్లే మైలేజ్...

150 రూపాయలు లేదా 200 రూపాయలు విలువచేసే చీరను 10 రూపాయలకే ఇస్తామని ప్రకటన చేస్తారు. షాపింగ్ మాల్ కి వచ్చిన 200 మందికి 200 చీరలు ఇచ్చిన 40 వేల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కాదు. అదే వాణిజ్య ప్రకటన ఇవ్వాలంటే దానికి డబుల్ ఖర్చవుతుంది. అంతేకాక ప్రజల నుంచి స్పందన కూడా పెద్దగా ఉండదు. అలాగే పండుగల సమయంలో కూడా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ, కార్లు, బైక్ లను అందించటం కూడా ఈ తరహా పబ్లిసిటీనే.. ఇక బట్టలపై డిస్కౌంట్ లు ఇవ్వటం వంటి ఆఫర్లు సైతం పబ్లిసిటీ కోసమే .

మహిళల వీక్ పాయింట్ మాల్స్ ప్లస్ పాయింట్

మహిళల వీక్ పాయింట్ మాల్స్ ప్లస్ పాయింట్

. మహిళలు మారాలి

పది రూపాయల కే చీర ఇస్తామని ఆఫర్ లు ప్రకటించి మహిళలకు చీరల పట్ల ఉండే బలహీనతలను ఆసరాగా చేసుకుని పబ్లిసిటీ చేస్తున్నాయి షాపింగ్ మాల్స్. ఇదంతా తెలియని మహిళలు గుడ్డెద్దు చేలో పడిన చందంగా షాపింగ్ మాల్స్ కు క్యూ కడుతున్నారు. తొక్కిసలాటలో గాయాలపాలై ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. కొత్త చీర మాట అటుంచి ఒంటి మీద ఉన్న చీరలు చింపుకుంటున్నారు. గతంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకునైనా జాగ్రత్త వహించాల్సిన పోలీసులు, అధికారులు తొక్కిసలాట జరిగాక తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. పది రూపాయల చీర కోసం ఆశపడి షాపింగ్ మాల్ కి వెళ్లి తొక్కిసలాటలో నానా ఇబ్బందులు పడిన మహిళలు షాపింగ్ మాల్స్ యాజమాన్యం తీరుపై ప‌లువురు మండిప‌డుతున్నారు. మీ బిజినెస్ కోసం మా ప్రాణాలతో చెలగాటం ఆడతారా? అని ఫైర్ అవుతున్నారు. అయితే ప్రాణాలను రిస్క్ లో పెట్టే ఇలాంటి ఆఫర్లకు మహిళలు స్పందించి క్యూలు కట్టినంత కాలం షాపింగ్ మాల్స్ ఈ తరహా ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటాయి. అందుకే షాపింగ్ మాల్స్ పెడుతున్న ఆఫర్లకు మహిళలు ప్రలోభపడకుండా జాగ్రత్త పడాలి. ఇక మహిళల చీరల మీద ఉండే వ్యామోహాన్ని ఆసరాగా చేసుకుని ఈ తరహా బిజినెస్ చేస్తున్న షాపింగ్ మాల్స్ కు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే అధికార యంత్రాంగం ముందుగానే వీటికి చెక్ పెట్టాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A stampede-like situation created at CMR shopping mall in Siddipet after it offered saree for Rs 10. Thousands of women rushed to the mall to get the sarees at the offer price which was arranged inside the cellar.As many as 20 women were injured after they jostled each other to get into the cellar. However, a woman also lost her 5 tolas of gold chain, Rs 6000 cash and a debit card. Alerted over the theft, the police reached the shopping mall and are investigating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more