రూల్స్ బ్రేక్.. పెళ్లికి ఎక్కువ హాజరైన బంధువుల.. రూ.30 వేల ఫైన్

కరోనా సమయంలో పెళ్లి అంటే కొంచెం ఇబ్బందే.. అయినా పర్మిషన్ తీసుకొని చేయాల్సిందే. కానీ బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చెప్పిన నంబర్ పెరిగితే అంతే సంగతులు. ఆంధ్రప్రదేశ్‌లో గల శ్రీకాకుళం జిల్లాలో ఓ ఇంటిలో జరిగిన వేడుకలో ఇలాంటి ఘటన జరిగింది. పెళ్లిలో కరోనా రూల్స్ బ్రేక్ చేయటంతో వారికి జరిమానా పడింది. అది కూడా రూ.30 వేలు అంటే అర్థం చేసుకోండి.

శ్రీకాకుళం జిల్లాలోని భామిని మండలం తాలాడ గ్రామంలో ఓ పెళ్లి రిసెప్షన్ వేడుకలో కోవిడ్ నిబంధనలు బేఖాతర్ చేశారు. పెద్ద ఎత్తున బంధువులు హాజరయ్యారు. ఈ విషయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులు కూడా హుటాహుటిన పెళ్లి జరిగే ఇంటికి వచ్చేశారు. పెళ్లి ఇంటిలో రిసెప్షన్ జరుగుతోంది. పెళ్లి కుమార్తె కుటుంబసభ్యులతో పాటు అదనంగా మరో 30 మంది బంధువులు సందడిగా కనిపించారు.

ap brides family get fined rs 30 thousand for break the rules

కరోనా నిబంధనలు పాటించకపోవడంతో ఆగ్రహించారు. కరోనా నిబంధనలు పాటించలేదు అని ఒక్కొక్కరికి రూ.1000 రూపాయల జరిమానా విధించారు. ఎక్కువగా ఉన్న 30 మందికి వెయ్యి రూపాయల చొప్పున 30 వేలు ఫైన్ వేశారు. అలా అని అక్కడనుంచి వెళ్లిపోలేదు.. ఫైన్ వసూలు చేసుకుని మరీ వెళ్లిపోయారు. సో పెళ్లి, రిసెప్షన్ ఉంటే బీ కేర్ ఫుల్. రూల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయొద్దు. లేదంటే ఇలా మీకు ఫైన్ పడుతుంది. ఇప్పటికైనా జర జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే ఫంక్షన్‌ను చుట్టుపక్కల వారు నిశీతంగా గమనిస్తున్నారనే విషయం మాత్రం మరవండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+