శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకసభ ఎన్నికలు 2019 : శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

By Staff
|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : Srikakulam Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

శ్రీకాకుళం లోక్‌స‌భ నియోజ‌కర్గానికి ఏపిలో ప్ర‌త్యేక స్థానం ఉంది. అన్ని వ‌ర్గాల స‌మ్మిళ‌తం ఈ నియోజ‌క‌వ‌ర్గం. ఎన్న ఎన్ని క‌ల్లో విభిన్న తీర్పు ఇక్క‌డి ప్ర‌జ‌ల ప్ర‌త్యేక‌త‌. న‌మ్మితే ఏ రకంగా అధారిస్తారో ఇక్క‌డి నేత‌ల రాజ‌కీయ ముఖ‌చిత్రం చూస్తూ అర్దం అవుతుంది. ఏపి-ఒడిశా స‌రిహ‌ద్దు నియోజ‌క‌వ‌ర్గం కావ‌టంతో ఈ నియోజ‌కవ‌ర్గంలో ఒడిశా ప్రాంత వాసులు కూడా ఎ క్కువ‌గా క‌నిపిస్తూ ఉంటారు. ఈ నియోజ‌క ప‌రిధిలో గ‌త మూడు ద‌శాబ్దాలుగా రాజ‌కీయ చిత్రం మారిపోయింది.

1952 తొలి ఎన్నిక‌..

శ్రీకాకుళం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం 1952 లో ఏర్ప‌డింది. అప్ప‌టి నుండి 17 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇక్క‌డ ప్ర‌ధానంగా గౌతు ల‌చ్చ‌న్న లాంటి యోధులు ఇక్క‌డి నుండి లోక్‌స‌భ‌లో అడుగు పెట్టారు. ఎన్జీ రంగా లాంటి ప్ర‌ముఖ రైతాంగ నేత‌, బి రాజ‌గోపాల రావు, క‌ణితి విశ్వ‌నాధం సైతం ఇక్క‌డి నుండి పార్ల‌మెంట్ కు ఎన్నికైన వారే. ఇక‌, కింజ‌ర‌పు కుటుంబాన్ని ఈ నియోజ‌క‌వ‌ర్గం ఆద‌రించింది. నాడు తండ్రి ఎర్రంనాయ‌డు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. నేడు కుమారుడు కింజ‌ర‌పు రామ్మోహ‌న నాయుడు ఎంపిగా ఉన్నారు. ఇక్క‌డి నుండే గెలిచిన కృపారాణి సైతం కేంద్ర మంత్రి అయ్యారు.

నియోజ‌క‌వ‌ర్గంలో 20 ల‌క్ష‌ల పైగా జ‌నాభా...

శ్రీకాకుళం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో 2014 ఎన్నిక‌ల ప్ర‌కారం మొత్తం జ‌నాభా 19 ల‌క్ష‌ల 33 వేల 930 మంది. అందులో గ్రామీణ జ‌నాభా 78.62 శాతం కాగా, ప‌ట్ట‌ణ జ‌నాభా 21.38 శాతంగా ఉంది. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో ఎస్సీ జ‌నాభా 8 శాతం ఉంది. ఎస్టీ జ‌నాభా 4.82 శాతంగ న‌మోదైంది.

#LokSabhaElection2019: All about Srikakulam Constituency

15 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు..

ఈ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో 2014 లెక్క‌ల ప్ర‌కారం 1,413, 989 మంది ఓట‌ర్లు ఉన్నారు. అందులో 706,828 మంది పురుష ఓట‌ర్లు ఉండ‌గా, 707,161 మంది మ‌హిళా ఓట‌ర్లు ఉన్నారు. ఇందులో, 2014 ఎన్నిక‌ల్లో 10 ల‌క్ష‌ల 51 వేల 446 మంది ఓటు హ‌క్కు వినియోగంచుకున్నారు. వారిలో 505,010 మంది పురుష‌, 546,436 మంది మ‌హిళా ఓట‌ర్లు ఉన్నారు. కాగా, 2014 లో మొత్తం పోలింగ్ 74 శాతంగా న‌మోదైంది.

2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెలుపు..

2014 లో శ్రీకాకుళం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి నుండి పోటీ చేసిన కింజ‌ర‌పు రామ్మోహ‌న‌నాయుడు వైసిపి అభ్య‌ర్ధి పై ల‌క్షా 27 వేల 572 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టిడిపి అభ్య‌ర్ధికి 556,163 ఓట్లు రాగా, వైసిపి అభ్య‌ర్ధి అయిన శాంతి కి 428,591 ఓట్లు వ‌చ్చాయి. కాగా, టిడిపి అభ్య‌ర్ధి రామ్మోహ‌న నాయుడు 127, 572 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు మాజీ మంత్రి ఎర్రం నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ సానుభూతి టిడిపికి బాగా కలిసి వ‌చ్చింది. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో టిడిపి అధిక్య‌త సాధించింది.

సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త‌..

శ్రీకాకుళం లోక్‌స‌భ నియోజ‌వ‌ర్గ ప‌రిధి వెనుక‌బ‌డిన ప్రాంతంగా చెబుతూ ఉంటారు. అయితే, ఇక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డి ప్ర‌ధాన సామాజిక వ‌ర్గ‌మైన క‌ళింగుల నుండి ప‌ది సార్లు ఎంపిగా గెలిచారు. అదే విధంగా అయిదు సార్లు కొప్పుల వెల‌మ వ‌ర్గం నుండి గెలుపొందారు. ఒక సారి గౌడ సామాజిక వ‌ర్గం నుండి, ఒక సారి క‌మ్మ సామాజిక వ‌ర్గం నుండి లోక్‌స‌భ కు ఎన్నిక‌య్యారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం లో మూడు సార్లు స్వ‌తంత్ర అభ్య‌ర్ధి, ఎనిమిది సార్లు కాంగ్రెస్‌, ఆరు సార్లు టిడిపి అభ్య‌ర్దులు గెలుపొందారు.

రామ్మోహ‌న్ వాగ్దాటికి మంచి గుర్తింపు..

ఇక‌, తొలి సారి ఎన్నికైన రామ్మోహ‌న నాయుడు ఎంపీగా త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నారు. ఏపికి ద‌క్కాల్సిన విభ‌జ‌న హామీల పై పార్ల‌మెంట్‌లో ఆయ‌న ప్ర‌సంగం అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంది. విభ‌జ‌న అంశాల పై చ‌ర్చ స‌మ‌యంలో ఇంగ్లీషు, హిందీ భాష‌ల్లో రామ్మోహ‌న్ ఏపి ఇబ్బందుల‌ను స‌భ దృష్టికి తీసుకొచ్చి వాటిని ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేసారు. ఆయ‌న స‌మావేశాల్లో మొత్తం 95 చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. ఒక ప్ర‌యివేటు బిల్లును ప్ర‌తిపాదించారు. డిసెంబ‌ర్ చివ‌రి వ‌ర‌కు 422 ప్ర‌శ్న‌లు సంధించారు. స‌భ‌కు హాజ‌రు 94 శాతంగా న‌మోదైంది.

2019 ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం..

శ్రీకాకుళం నుండి వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు టిడిపి ప్ర‌స్తుత ఎంపి రామ్మోహ‌న్ నాయుడును బ‌రిలోకి దించే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే, ఆయ‌న ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆస‌క్తితో ఉన్నార‌ని స‌మాచారం. ఇక‌, వైసిపి నుండి గ‌తం లో పోటీ చేసిన శాంతి తిరిగి పోటీ చేయాల‌ని భావిస్తున్నా..వైసిపి మాత్రం మ‌రింత బ‌ల‌మైన అభ్య‌ర్ధి కోసం ప్ర‌య‌త్నాల ను కొన‌సాగిస్తోంది. ఇక్క‌డ జ‌న‌సేన ప్ర‌భావ‌మూ ఎక్కువ‌గానే ఉంది. దీంతో..ఈ సారి ఎన్నిక ఇక్క‌డ ర‌స‌వ‌త్తరంగా మారే అవ‌కాశం ఉంది.

English summary
Lok Sabha Election 2019: Know detailed information on Srikakulam Lok Sabha Constituency of Andhra Pradesh. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Srikakulam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X